ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభం లో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా వల్ల మరణించిన అకాల మరణాల పై ప్రతిపక్ష పార్టీ టీడీపీ వైసీపీ ని.
ప్రశ్నల వర్షం తో ముంచెత్తింది.అనంతరం వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు దాదాపు మూడు రోజుల తర్వాత ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా నేడు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపేలా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.ఇదే సమయంలో ప్రశ్నోత్తరాల చర్చ కూడా జరగనుంది.ఈ చర్చలో పోలవరం ప్రాజెక్టు మరియు వైజాగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీఎంఆర్ఎఫ్, మత్స్యకారులకు ఆర్థిక సాయం, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, ఆశా వర్కర్ల జీతాలు, కోవిడ్ నష్టపరిహారం, ఆర్టీసీ బలోపేతం, ఎంపీఈవో లకు కనీస వేతనం.చర్చకు రానున్నాయి.
ఇక ఇదే సమయంలో ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి కూడా ప్రారంభం కానుంది.మండలిలో కూడా ప్రశ్నోత్తరాల చర్చ జరగనుంది.







