యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణితో కలిసి సరదాగా ముచ్చటించారు.ఈ క్రమంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ మీ తండ్రి నటించిన సినిమాలను రీమేక్ చేయాలని ఉందా అని ప్రశ్నించారు.
నటుడు హరికృష్ణ నటించిన సీతయ్య సినిమాను రీమేక్ చేస్తావా? అని ప్రశ్నించారు.కీరవాణి ఇలా అడగడంతో ఎన్టీఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా తన తండ్రి నటించిన సీతయ్య సినిమాని రీమేక్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ తెలియజేశారు.అయితే ఈ సినిమాని రీమేక్ చేయాలంటే తారక్ మరికొన్ని కండిషన్లు కూడా పెట్టారు.
మరి ఆ కండిషన్ లు ఏంటి అనే విషయానికి వస్తే.

ఎన్టీఆర్ సీతయ్య సినిమాను రీమేక్ చేస్తే కనుక ఆ సినిమాకు తప్పకుండా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాలనే కండిషన్ పెట్టారు.అదే విధంగా ఈ సినిమాలో ఎంతో ఫేమస్ అయిన డైలాగ్ వినపడదు, వినలేదు, వినడు తప్పనిసరిగా ఉండాలనే కండిషన్ పెట్టారు.ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ సినిమాల గురించి షాకింగ్ కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







