టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ కి తన మామయ్యలు మెగాస్టార్ చిరంజీవి, స్నేహ రెడ్డి తల్లిదండ్రులు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి దంపతులు పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారు.
ఈ విధంగా అల్లు అర్జున్ కు పార్టీ ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.
సాధారణంగా ఎప్పుడూ వార్తల్లో కనిపించని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పార్క్ హయాత్ హోటల్‌లో ఘనంగా తన అల్లుడు అల్లు అర్జున్ కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా ఫాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ విధంగా ఈ సినిమా విజయవంతం కావడంతో తన మామ చంద్రశేఖర్ రెడ్డిని ఘనంగా తన అల్లుడికి సన్మానం చేశారు.

అల్లు అర్జున్ సినీ కెరీర్లో ఈ విధమైనటువంటి విజయాలు, పార్టీలు కొత్తేమి కాదు కానీ ఎప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండే తన మామ చంద్రశేఖర్ రెడ్డి తనకు పార్టీ ఇవ్వడంతో ఈ పార్టీ అల్లు అర్జున్ కి ఎంతో ప్రత్యేకత అని చెప్పాలి.ఈ క్రమంలో తన అల్లుడిని అభినందిస్తూ గ్రాండ్ పార్టీ ఇచ్చారు.ఈ వేడుక చంద్రశేఖర్ రెడ్డి దంపతులు, అల్లు అరవింద్ దంపతులు, మెగాస్టార్ దంపతులు, స్నేహ రెడ్డి, త్రివిక్రమ్, హరీష్ శంకర్, క్రిష్, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.అల్లు అర్జున్ ఫ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం రవికుమార్ గజమాలతో బన్నీని సత్కరించారు.
హాజరయ్యారు.







