టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బన్నీ డబ్బింగ్ సినిమాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యారనే సంగతి తెలిసిందే.పుష్ప ది రైజ్ హిందీలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదల కాగా ఈ సినిమా బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
పుష్ప ది రైజ్ కోసం బన్నీ 45 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.ఈ సినిమా నిర్మాతలకు బాగానే లాభాలను అందించింది.అయితే పుష్ప ది రూల్ కోసం బన్నీ రెమ్యునరేషన్ కు బదులుగా పుష్ప ది రూల్ బాలీవుడ్ హక్కులను తీసుకున్నారని తెలుస్తోంది.పుష్ప ది రైజ్ హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించగా పుష్ప ది రూల్ కూడా బాలీవుడ్ లో అంచనాలను మించి కలెక్షన్లను సాధించే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.
త్వరలో పుష్ప2 మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది.సుకుమార్ ప్రస్తుతం పుష్ప2 కోసం లొకేషన్లను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

కేరళ, అరుణాచల్ ప్రదేశ్ అడవులలో పుష్ప2 షూటింగ్ జరగనుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.ఏప్రిల్ లేదా మే నెలలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.పుష్ప ది రైజ్ సక్సెస్ తర్వాత సుకుమార్ స్క్రిప్ట్ లో స్వల్పంగా మార్పులు చేశారని తెలుస్తోంది.పుష్ప ది రైజ్ లా పుష్ప ది రూల్ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.
పుష్ప ది రూల్ సక్సెస్ బన్నీ కెరీర్ కు ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రాజీ పడకుండా ఈ సినిమాను తెర్కెక్కించడం గమనార్హం.
ఈ సినిమా తర్వాత బన్నీ సినిమా గురించి క్లారిటీ రావాల్సి ఉంది.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి బన్నీ ఆసక్తి చూపిస్తున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
పుష్ప ది రూల్ హక్కుల ద్వారా బన్నీకి 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ రూపంలో దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.







