చెరువు, నదుల్లో ఎన్నో రకాల చేపలు ఉంటాయి.వాటిలో కొన్ని దాదాపు 30 నుంచి 40 కిలోలు బరువు ఉంటాయి.
అయితే ఇప్పుడు వాటి కంటే పెద్ద చేపకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.దీనిని చూస్తే వామ్మో.
ఇది చేపనా.లేక తిమింగలమా అనే రీతిలో ఉంది.దగ్గర నుంచి కచ్చితంగా తిమింగలం అని అనుకోవచ్చు.ఇది ఏకంగా 10.5 అడుగుల పొడవు.500 నుంచి 600 పౌండ్ల బరువు ఉంది.చిన్నపాటి తిమింగలం మాదిరిగా ఉన్న ఈ చేపతో ఓ వ్యక్తి సరదాగా ఆడుకున్నాడు.దానిని పట్టుకొని ఎంజాయ్ చేశాడు.
వివరాల్లోకి వెళితే… కెనడాలోని ఫ్రేజర్ నది పరిసర ప్రాంతాల్లో కెనడియన్ జాలరి వైవ్స్ బిస్సన్ చేపల వేట సాగిస్తున్నాడు.ఈ క్రమంలో అతనికి భారీ చేప కనపించడంతో అవాక్కయ్యాడు.
స్టర్జన్ ఫిష్ గా పిలిచే ఈ చేప కనిపించడంతో దానిని పట్టుకొని కెమెరాలో బంధించాడు.దీని వయస్సు ఒక శతాబ్ధం కంటే ఎక్కువ కాలం ఉంటుందని చెప్పొచ్చు.
ఆ చేపను పట్టుకొని RFID చిప్ ట్యాగ్ తొలగించి వదిలేశారు.ఈ ఆదిమ జాతుల్లో సూమారు 29 జాతులకు స్టర్జన్ అనేది ఒక సాధారణ పేరుగా పరిశోధకులు పేర్కొంటున్నారు.
దీనికి నోటిలో దంతాలు ఉండవని, మనుషులకు ఎటువంటి హానీని తలపెట్టవని చెబుతున్నారు.వీటి కంటే ఎక్కువ పెరిగే చేపలు కూడా ఉన్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.