ఈ ఆలయంలో తల లేని విగ్రహాలకు పూజలు.. ఎందుకంటే..

ఉత్తరప్రదేశ్‌లోని ఒక విచిత్ర దేవాలయం అందరినీ అలరిస్తుంది.ఇక్కడ చాలా దేవతా విగ్రహాలకు తలలు ఉండవు.

 Ashtbhuja Dham Temple History, Ashtbhuja Dham, Temple, Pooja, Uttar Pradesh, Au-TeluguStop.com

ఈ విగ్రహాలు 900 సంవత్సరాలుగా ఇక్కడ భద్ర పరిచారు.వాటికి పూజలు చేస్తుంటారు.

ఈ ఆలయం ఉత్తర ప్రదేశ్ రాజధాని నుండి 170 కి.మీ దూరంలో ప్రతాప్‌ గఢ్‌లోని గోండే గ్రామంలో ఉంది.ఈ ఆలయం సుమారు 900 సంవత్సరాల నాటిది.అష్ట భుజ ధామ్ ఆలయంలో విగ్రహాల తలలను ఔరంగ జేబు నరికించాడు.నేటికీ అదే స్థితిలో ఈ ఆలయంలోని శిల్పాలు కనిపిస్తాయి.ఏఎస్ఐ రికార్డుల ప్రకారం, మొఘల్ పాలకుడు ఔరంగజేబు 1699 ఏడీలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలని ఆదేశించాడు.

ఆ సమయంలో ఇక్కడ ఉన్న పూజారి దానిని రక్షించడానికి ఆలయం ప్రధాన ద్వారాన్ని మసీదు ఆకారంలో తయారు చేశాడు.తద్వారా ఈ ఆలయం ధ్వంసం కాకుండా ఉంటుందని భావించాడు.

మొఘల్ సైన్యం తొలుత ఈ ఆలయాన్ని గమనించ లేదు.కానీ ఒక కమాండర్ కళ్ళు ఆలయంలో  వేలాడుతున్న గంటపై పడ్డాయి.

అప్పుడు కమాండర్ తన సైనికులను ఆలయం లోపలికి వెళ్ళమని కోరాడు.అప్పుడు ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహాలన్నీ శిరచ్ఛేదం చేశారు.

నేటికీ ఈ ఆలయ విగ్రహాలు అదే స్థితిలో దర్శన మిస్తున్నాయి.ఆలయ గోడలు, శిల్పాలు, వివిధ రకాల బొమ్మలను చూసిన తర్వాత, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని 11వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు.

గెజిటీర్ ప్రకారం, ఈ ఆలయాన్ని సోమవంశీ క్షత్రియ ఘరానా రాజు నిర్మించాడు.ఆలయ ద్వారంపై ఉన్న బొమ్మలు మధ్య ప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఖజురహో ఆలయాన్ని పోలి ఉంటాయి.

ఈ ఆలయంలో ఎనిమిది చేతులతో అష్ట భుజ దేవి విగ్రహం ఉంది.ఈ ఆలయంలో పూర్వం అష్ట భుజ దేవికి చెందిన పురాతన అష్ట ధాతు విగ్రహం ఉండే దని గ్రామస్తులు చెబుతారు.

ఇది 15 ఏళ్ల క్రితం చోరీకి గురైంది.ఆ తరువాత గ్రామస్తులు సమిష్టి సహకారంతో అష్ట భుజ దేవి రాతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube