పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్లు ఏకంగా 45 కోట్ల రూపాయలుగా ఉంది.
సాధారణంగా కన్నడ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ మొత్తంలో కలెక్షన్లను సొంతం చేసు కోవడంలో ఫెయిల్ అవుతుంటాయి.అయితే పునీత్ అభిమానులు మాత్రం ఆయనపై ఉన్న అభిమానంతో జేమ్స్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లకు క్యూ కడుతున్నారు.
కర్ణాటకలోని 80 శాతం కంటే ఎక్కువ థియేటర్లలో జేమ్స్ సినిమా రిలీజైందని సమాచారం అందుతోంది.గతంలో కన్నడ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులన్నీ ఈ సినిమాతో బ్రేక్ అయ్యాయి.
పునీత్ చివరి సినిమాను చూసి అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు.థియేటర్లలో పునీత్ ఎంట్రీ సీన్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.
జేమ్స్ మూవీ రొటీన్ గానే ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మ రథం పడుతున్నారు.
కన్నడ ప్రేక్షకులు పునీత్ రాజ్ కుమార్ పై చూపిస్తున్న అభిమానాన్ని చూసి ఇతర హీరోల అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
జేమ్స్ సినిమా రిలీజైన ప్రతి థియేటర్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంది.సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో శుక్రవారం విడుదలవుతాయి.
అయితే పునీత్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా గురువారం రోజునే థియేటర్లలో విడుదల కావడం గమనార్హం.

జేమ్స్ మూవీ ఫుల్ రన్ లో మరింత ఎక్కువగా కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.పునీత్ రాజ్ కుమార్ పై అభిమానులు చూపిస్తున్న ప్రేమ అంతా ఇంతా కాదు.పునీత్ మరణించినా సినిమాల ద్వారా అభిమానుల హృదయాల్లో జీవించి ఉన్నారనే కామెంట్లు వ్యక్త మవుతున్నాయి.
పునీత్ రాజ్ కుమార్ భార్య మాత్రం ఈ సినిమాను తాను చూడలేనని వెల్లడించడం గమనార్హం.







