పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా మూడు వారాల క్రితం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోయినా పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రం ఆకట్టుకుంది.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించి మెప్పించారు.పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిత్యామీనన్ నటించగా రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించారు.
ఈ సినిమా ఈ నెల 25వ తేదీనుంచి ఆహా ఓటీటీలో, డిసీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే.ఒకవైపు ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండగా మరోవైపు ఓటీటీలో భీమ్లా నాయక్ రిలీజ్ కానుండటం గమనార్హం.
అయితే ఆహా ఓటీటీలో భీమ్లా నాయక్ చూసేవాళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు ఆహా ఓటీటీ తెలిపింది.భీమ్లా నాయక్ మూవీలో పవన్ కళ్యాణ్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను వాడాడనే సంగతి తెలిసిందే.

పవన్ బైక్ పై సినిమాలో కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఆహా సబ్ స్క్రైబర్లలో ఒకరు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను గెలుచుకోవచ్చు.భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ తర్వాత ఆహా ఓటీటీని కొత్తగా సబ్ స్క్రైబ్ చేసుకునే వాళ్లలో ఒకరికి ఈ బైక్ దక్కనుంది.ఆహాలో ప్రసారమయ్యే సింగింగ్ షో అయిన ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షోలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
ఈ బైక్ ను గెలుచుకున్న వ్యక్తికి త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా బైక్ ను అందించనున్నారని సమాచారం అందుతోంది.పవన్ కళ్యాణ్ వాడిన బైక్ ను గెలుచుకునే లక్కీ విన్నర్ ఎవరో తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.







