మిస్ వరల్డ్ 2021 పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచిన భారతీయ-అమెరికన్ శ్రీ షైనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను గుండె జబ్బు, ముఖంపై కాలిన గాయాల నుంచి బయటపడ్డానని తెలిపారు.
అందువల్ల వికలాంగులైన ప్రతి ఒక్కరికీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు శ్రీ షైనీ చెప్పారు.హార్ట్ పేషెంట్‌గా తనకు 12 ఏళ్ల వయసులోనే పేస్ మేకర్‌ను అమర్చారని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఈ శస్త్ర చికిత్స కారణంగా డ్యాన్స్ చేయకూడదని వైద్యులు తెలిపారు.కానీ తాను డ్యాన్స్‌ను విడిచిపెట్టలేదని తెలిపారు.
పోలాండ్‌లో కరోలినా బిలవ్క్సాలో జరిగిన అందాల పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచారు శ్రీషైనీ.మిస్ వరల్డ్ 2021 పోటీలో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించిన మానస వారణాసికి టాప్ 13 కంటెస్టెంట్స్‌లో మాత్రమే చోటు దక్కింది.
పంజాబ్ రాష్ట్రం లూధియానాలో 1996 జనవరి 6న జన్మించారు శ్రీషైనీ.ఆమెకు ఐదేళ్లు వున్నప్పుడే షైనీ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది.
బాల్యంలో వున్నప్పుడే పేదరికాన్ని చాలా దగ్గరి నుంచి చూసిన ఆమె.పిల్లలకు అందమైన బాల్యాన్ని అందించాలనే సామాజిక బాధ్యతను స్వీకరించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. 12 ఏళ్ల వయసున్నప్పుడు షైనీ హృద్రోగం బారినపడ్డారు.ఆమె హృదయ స్పందన నిమిషానికి కేవలం 20 బీట్స్‌గానే వుండేది.దీంతో ఆమె మళ్లీ డ్యాన్స్ చేయడం కుదరదని వైద్యులు వారి కుటుంబానికి తెలిపారు.

కానీ మొక్కవోనీ దీక్షతో శ్రీషైనీ గంటల తరబడి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్‌లో పట్టు సంపాదించింది.షైనీ హార్వర్డ్ యూనివర్సిటీ, యేల్ స్కూల్ ఆఫ్ డ్రామా, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసింది.వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన శ్రీషైనీ.మిస్ వరల్డ్ అమెరికా కిరీటం పొందిన తొలి ఇండో అమెరికన్‌గా రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే.గత ఏడాది అక్టోబర్‌లో లాస్ ఏంజిల్స్‌లోని మిస్ వరల్డ్ అమెరికా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఫైనల్ పోటీలలో డయానా హేడెన్ శ్రీ షైనీకి కిరీటం ధరింపజేశారు







