డైరెక్టర్ రవి చరణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే అన్యాయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.ఇందులో అమిత్ తివారీ, భాను శ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ముక్కు అవినాష్ తదితరులు నటించారు.
ఈ సినిమాకు ఆర్ ఎమ్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.వేణు మురళి సినిమాటోగ్రఫీ అందించాడు.
ఈ సినిమాకు పి ఆర్ సంగీతాన్ని అందించాడు.శివ సర్వాణి ఎడిటర్ గా చేశాడు.
నబా ఫైట్స్ ని అందించాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.
కథ:
అమిత్ తివారీ ఇందులో నల్లమల్ల అనే పాత్రలో నటించాడు.ఆయన అటవీ ప్రాంతంలో ప్రకృతిని, సాధు జంతువులను ప్రేమించే యువకుడిగా ఉంటాడు.ఇక తన ప్రాంతంలో ఉండే వారికి కావాల్సినంత సహాయం చేస్తూ ఉంటాడు.ఇక అతనికి వనమాలి పాత్రలో నటిస్తున్న భానుశ్రీ అంటే చాలా ఇష్టం.అంతేకాకుండా మేలురకం జాతి ఆవుల అంటే అతడికి ఎంతో ఇష్టం.
ఇక ఈయన నల్లమల అడవి ప్రాంతంలో అక్రమ వ్యాపారం చేసే వారికి ఎదురు తిరుగుతూ పోరాడుతాడు.అలా ఇక్కడ జరిగే అక్రమ వ్యాపారం ఏంటి.
తాను ఇష్టపడిన వనమాలిని పెళ్లి చేసుకుంటాడా లేదా.నల్లమల్ల వాళ్ళని ఎందుకు ఎదిరిస్తాడు అనేది మిగిలిన కథ లోనిది.

నటినటుల నటన:
హీరోగా అమిత్ తివారీ అద్భుతంగా నటించాడు.యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాగా ఆకట్టుకున్నాడు.బాను శ్రీ హీరోయిన్ గా నటించి తన పాత్రతో బాగా ఆకట్టుకుంది.తన డాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పవచ్చు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా సినిమా బ్యాక్ గ్రౌండ్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది.ఎడిటింగ్ కూడా అద్భుతంగా ఉంది.ఇక పాటలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు.

విశ్లేషణ:
ఈ సినిమా ఒక ఎమోషనల్ పాయింట్ తో ప్రారంభమవుతుంది.ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కథ బాగా ఆసక్తి గా మారుతుంది.మాజీ నక్సలైట్ చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో కథ ఆకట్టుకుంటుంది.
పైగా ఒక ఆవు చుట్టూ తిరిగే ఎమోషనల్ పాయింట్ తో డైరెక్టర్ అద్భుతంగా రూపొందించాడు.

ప్లస్ పాయింట్స్:
అమిత్ తివారీ నటన, సినిమాటోగ్రఫీ, సంగీతం, కథ, యాక్షన్ సన్నివేశాలు, పాటలు ఇవన్నీ బాగా ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్: కాస్త సాగినట్లు గా అనిపించింది.
బాటమ్ లైన్:
ఇక ఈ సినిమా అడవి ప్రాంతంలో జరిగే అన్యాయాల నేపథ్యంలో తెరకెక్కింది.డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా బ్యాక్ గ్రౌండ్ ను అందించాడు.మొత్తానికి ఈ సినిమా ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుందని తెలుస్తుంది.