హైదరాబాద్‌కు 300 ఎలక్ట్రిక్ బస్సులు... ప్యాసింజర్లకు అదిరిపోయే ఫెసిలిటీలు..!

కొన్నేళ్ల క్రితమే గ్రేటర్ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో 39 ఎలక్ట్రిక్ బస్సులను రన్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

 Tsrtc To Launch 300 Electric Buses In Greater Hyderabad Details, Hyderabad, 300-TeluguStop.com

ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్యాసింజర్లు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.అలాగే వీటిలోని ఫెసిలిటీస్ కి ఫిదా అయిపోతున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా మరో 300 నాన్‌-ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ సిద్ధమయ్యింది.పెరుగుతున్న డీజిల్ ధరల భారాన్ని తగ్గించడంతోపాటు ప్యాసింజర్ల సంఖ్యను పెంచుకునేందుకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలెట్టింది.

అయితే ప్రస్తుతం 300 ఎలక్ట్రిక్ బస్సులను ఒకేసారి కొనుగోలు చేసేంత బడ్జెట్ ఆర్టీసీకి లేదు.అందుకే వీటిని రెంటుకు తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తున్నట్లు టాక్.త్వరలోనే ఈ బస్సులను అద్దెకు తీసుకోవచ్చని తెలుస్తోంది.రెగ్యులర్ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువ ఫెసిలిటీలు కలిగివుంటాయి.

ఈ బస్సుల్లో ప్రతి సీటు పక్కన మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్స్, కంఫర్టబుల్ సీట్లు, స్టాప్‌ల ఇన్ఫో తెలిపే డిజిటల్‌ బోర్డులు, సీసీ కెమెరాలు ఉంటాయి.ఇవన్నీ కూడా ప్యాసింజర్లకు బాగా ఉపయోగపడేవే.

అయితే త్వరలోనే అందుబాటులోకి రానున్న 300 ఎలక్ట్రిక్ బస్సుల్లో 20 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులను ప్రతి డిపోకి కేటాయించే అవకాశం ఉంది.

Telugu Electric Busses, Hyderabad, Latest, Launchelectric, Tsrtc-Latest News - T

అలా అన్ని రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ ప్యాసింజర్లకు అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ యోచిస్తోంది.ఇలా చేయడం ద్వారా ఇకపై హైదరాబాదులో ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులే కనిపించే అవకాశం ఉంటుంది.రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో హైదరాబాద్‌లో టోటల్ గా ఎలక్ట్రిక్ బస్సులనే తీసుకురావాలని ఆర్టీసీ ఇప్పటికే ఒక ప్లాన్ రచించింది.

ఎలక్ట్రిక్ బస్సులను వాడటం ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు.అలాగే డీజిల్ భారం తగ్గి ఎక్కువ ప్రాఫిట్స్ మిగిలే అవకాశం ఉంటుంది.అందుకే వీలైనంత త్వరగా విద్యుత్ శక్తి తో నడిచే బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ కృషి చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube