సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు నమ్మలేనంత వింతగా, షాకింగ్ గా ఉంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను షాక్ కు గురి చేస్తోంది.
ఈ వీడియోలో డ్రైవర్ లేకుండానే ఒక వాహనం ముందుకెళ్లింది.ఈ వెహికల్ లో డ్రైవర్ లేడు.
బండి ఆన్ కూడా చేయలేదు కానీ అది దానంతట అదే స్టార్ట్ అయ్యి ముందున్న రెండు కార్లను ఢీకొట్టంది.ఎవరో కక్షగట్టి చేసినట్లుగా ఉంటుంది ఈ వీడియో చూస్తే.
ఈ సీన్లలన్నీ పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.దీనిని చూసిన వారంతా షాక్ కు గురవుతున్నారు.
దెయ్యం ఏమైనా ఈ పని చేసిందా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియోలో, రోడ్డుపక్కన ఓ రిక్షా పార్కు చేసి ఉండటం గమనించవచ్చు.
పక్క నుంచి ఓ వ్యక్తి వెళ్తున్నాడు.ఇంతలో రోడ్డు పక్కనే ఉన్న రిక్షా ముందుకు కదిలింది.
డ్రైవర్ లేకుండానే ముందుకెళ్లి.పక్కన పార్కు చేసిన కార్లను ఢీకొట్టంది.
మొదట కారును ఢీకొట్టి, ఆ తరువాత పక్కనే ఉన్న మరో కారును ఢీకొట్టింది.పక్కన ఉన్న వ్యక్తి ఆపడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డ్రైవర్ లేకుండా రెండు కార్లు ఢీకొట్టడం చూసి నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.దెయ్యమే ఈ పని చేసిందా.కార్లపై రివేంజ్ తీసుకుందా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
ఈ వీడియో చూడటానికి నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు.ఈ వీడియోని మీరు కూడా ఓ సారి చూసేయండి.







