టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని 50 %.చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను ముంబై స్టూడియోలో స్టార్ట్ చేసారు.
ఈ షూట్ లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నాడు.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా సల్మాన్ ఖాన్ మేకర్స్ కు కండిషన్ పెట్టాడట.అది ఏంటంటే.
ఈయన ఈ సినిమాలో నటించేందుకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట.ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఈయన అడగగానే ఈ సినిమాలో అతిథి పాత్రలో చేయడానికి ఒప్పుకోవడంతో మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట.

కానీ సల్మాన్ రెమ్యునరేష్ ఇచ్చేటట్టు అయితే సైన్ చేయను అని చెప్పేశాడట.ఇదంతా కూడా ఆయన మెగాస్టార్ కారణంగానే చేసాడని టాక్.ఎందుకంటే గత కొన్నేళ్లుగా వీరిద్దరూ స్నేహం గా ఉంటున్నారు.
సల్మాన్ ఖాన్ స్నేహానికి ఎంతో విలువ ఇస్తాడు.

ఒక్కసారి ఆయనతో స్నేహం కుదిరితే ఇక సల్మాన్ ఖాన్ ఎంత దూరం అయినా వెళ్తాడు అని మరోసారి నిరూపించాడు.స్నేహానికి ప్రాధాన్యం ఇచ్చే సల్మాన్ ఖాన్ చిరు కోసం రెమ్యునరేషన్ లేకుండానే నటించడానికి ఒప్పుకున్నాడు.ప్రెసెంట్ సల్మాన్ ఖాన్, చిరంజీవి పై కీలక సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి.
ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.