బహుజన రాజ్యాధికార యాత్ర 11 వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు కు చేరుకుంది.ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కూడళ్ళలోని బాబాసాహెబ్ అంబేద్కర్ , బాబు జగ్జీవన్ రావు , మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు.
అనంతరం పట్టణ ప్రధాన వీదులలో తిరిగి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంకు చేరుకున్న బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.
ఈ యాత్ర మహనీయులు కలలు కన్న రాజ్యాన్ని నిర్మించే యాత్ర అన్నారు.ఇప్పటి వరకు 11రోజుల నుంచి యాత్ర కొనసాగుతుందని ఈ యాత్రలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని చివరి వరకు పోలీసు అనుమతి లభించ లేదు అని అదే కేసీఆర్ సభలు నిర్వహించడానికి అనుమతులు ఉంటాయని అన్నారు.
ఇప్పటి వరకు మనం 75 సంవత్సరాలలో అన్ని పార్టీలకు ఓట్లు వేసి గెలిపిస్తే బహుజనుడి బతుకు ఎక్కడవేసిన గొంగళి అక్కడనే చందంగా ఉందన్నారు.బహుజనులు చిమ్మ చీకటిలో జీవితాన్ని వెల్లబుచ్చుతున్నారని, కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ ఎక్కడ కనిపించడంలేదని , తెలంగాణ మొత్తం బాధల తెలంగాణ గా ఉందని ఎద్దేవ చేశారు.
తెలంగాణ లో ప్రతి ఒక్కరికీ విద్య కావాలని అడుడితే మద్యం ఇస్తున్నారని విమర్శించారు.తెలంగాణ లో ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని , ఓ గ్రామంలో ఏకంగా 60 బెల్టుషాపులు ఉన్నాయని అన్నారు.
రాష్ట్రంలో డబల్ బెడ్ రూం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు, అవి నిర్మాణ దశలోనే కూలిపోతున్నాయని అన్నారు.ఒకప్పుడు హైదరాబాద్ కు మంచినీరు అందించే గండిపేట, హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ప్రాంతంలో లక్షల ఎకరాల భూములను భూస్వాములు కొనిపెట్టుకున్నారు.
అట్టి భూములను ఎకరానికి సుమారు 10 కోట్లు పైగానే విలువ చేస్తుండగా అట్టి భూములు అమ్మి సొమ్ము చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 111జిఓను రధ్ధు చేసి రియల్టర్ ల జేబులు నింపే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ బహుజనుడు ఉండడని, ఎక్కడ పేదరికం ఉంటుందో ఎక్కడ దళిత బందు , బతుకమ్మ చీరలు,కళ్యాణ లక్ష్మీ లాంటి చిన్న చిన్న ప్రభుత్వ పథకాలు ఉంటాయో అక్కడ బహుజనుడు ఉంటాడని అన్నారు.
రాజ్యాధికారం మనచేతికి వచ్చిననాడు ఈ యాత్ర కు సరైన న్యాయం లభిస్తుందన్నారు.ఎస్సి ,ఎస్టీ సబ్ ప్లాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలు కాగితాలపై పొందుపరిచింది .మరి ఎక్కడ ఖర్చు పెట్టారో నిలదీయాలని అన్నారు.ధళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ అమలు చేశారని మన ఎంఎల్ ఏలను నిలదీయాలని సూచించారు .బహుజన సమాజ్ పార్టీ పోరాటం మొదలు పెట్టాకే రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల జాతర మొదలైందని, అధికారంలోకి వచ్చి ఎనిమిది ఏండ్లు గడుస్తున్పా ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు.బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు రాజ్యాధికారం అనే మంత్రదండం మన చేతిలో ఉండాలని రాజ్యాధికారం అనే మాస్టర్ కీ మన చేతిలో ఉంటె మన జీవితాలు మారుతాయని అన్నారు .రానున్నరోజుల్లో బహుజన సమాజ్ పార్టీకి రాజ్యధికారం కల్పించాలని పిలుపునిచ్చారు.







