నా నోట మాట రావడం లేదు...ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలను: సుకుమార్

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరో హీరోయిన్ లకు మాత్రమే అభిమానులు ఉంటారు.కానీ ఒక సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడికి మాత్రం అభిమానులు ఉండటం చాలా అరుదు.

 Director Sukumar Emotional Comment , Sukumar , Tollywood , Comment , Emotional ,-TeluguStop.com

ఇప్పటివరకు మనం హీరో హీరోయిన్లకు ఉన్న అభిమానుల గురించి మాత్రమే విన్నాము.అభిమాన హీరోల సినిమాలు వస్తున్నాయంటే వారి ఫ్యాన్స్ చేసే హంగామా గురించి అందరికీ తెలిసిందే.

కానీ దర్శకుడికి కూడా అభిమానులు ఉంటారని, వారి అభిమానాన్ని ఇలా వినూత్నమైన రీతిలో తెలియజేస్తారని సుకుమార్ విషయంలో మాత్రమే తెలిసింది.

పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ పై ఉన్న అభిమానంతో ఒక అభిమాని చేసిన పని తెలుసుకున్న సుకుమార్ కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఇంతకీ ఆ అభిమాని ఏం చేశారనే విషయానికి వస్తే.సువీక్షిత్‌ బొజ్జా అనే అప్ కమింగ్ హీరో ఎన్నో ఏళ్లుగా దర్శకుడు సుకుమార్‌కి పెద్ద అభిమానిగా మారిపోయాడు.

ఈ క్రమంలోనే అతనిపై ఉన్న అభిమానంతో ఇప్పటివరకు ఎవరు చేయని పనిని చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Telugu Drone Camera, Puspa, Crop, Sukumar, Suvikshit Bojja, Telugu, Tollywood-Mo

దూరదర్శిని అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సువీక్షిత్‌.సుకుమార్ పై ఉన్న అభిమానంతో ఆయన సొంత వ్యవసాయ భూమిలో రెండున్నర ఎకరాల భూమిలో దర్శకుడు సుకుమార్‌ రూపాన్ని వచ్చేటట్లు వరి పంటతో సాగు చేశారు.సుమారు 50 రోజుల పాటు కష్టపడుతూ సుకుమార్ రూపాన్ని తీసుకువచ్చారు.

కేవలం సుకుమార్ రూపం మాత్రమే కాకుండా పుష్ప 2 అని కూడా సాగుచేశారు.ఈ క్రమంలోనే ఇలా వరి పంటను సాగు చేసి అనంతరం డ్రోన్ కెమెరా సహాయంతో వీడియో చిత్రీకరించి ఒక అద్భుతమైన పాటను జోడించాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై సుకుమార్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.నా నోట మాట రావడం లేదు.

ఈ అభిమానం చూసి కళ్ళు చెమ్మగిల్లాయి.ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అంటూ తన అభిమాని సువీక్షిత్‌ ను సుకుమార్ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube