దేశం కాని దేశం పనికోసం వెళ్ళిన ఓ మహిళ అక్కడ యజమాని తనకు సరైన సదుపాయాలు కల్పించలేదని, మంచిగా చూసుకోవడం లేదంటూ యజమానిపై పగ పెట్టుకుంది.యజమానిపై ఎలా రివెంజ్ తీర్చుకోవాలోనని ఆలోచిస్తున్న ఆమెకు ఓ ఐడియా తట్టింది.
అంతా మనచేతుల్లోనే కదా ఉంది అనుకుని తన ఐడియా కి పనిచెప్పింది.కట్ చేస్తే హత్యా నేరం కింద కువైట్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడమే కాదు, ఆమెపై దేశ బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించుకున్నారు.
ఇంతకీ యజమానిపై రివెంజ్ కోసం ఆమె ఏమి చేసింది….
సహజంగా కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లో పనికి వెళ్ళే వారిని అక్కడి యజమానులు చిత్ర హింసలు పెట్టిన ఘటనలు ఎన్నో విన్నాం అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.
కువైట్ ఫ్యామిలీ వద్ద పనిచేస్తున్న భారతీయ మహిళ పని మనిషి తన యజమాని తాను ఉండేందుకు వారి ఇంటిపై ఇచ్చిన గది ఏ మాత్రం బాగోలేదని కక్ష పెట్టుకుంది.వారిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యింది.
దాంతో ఆమె వంట చేసే సమయంలో మంచి నీటిని వాడే బదులు మురుగు నీటిని వాడుతూ వంట చేయడం మొదలు పెట్టింది.ఈ క్రమంలో
గడిచిన కొన్ని రోజుల నుంచీ తాము తింటున్న తిండి మురుగు వాసన వస్తుండటం గమనించిన యజమాని వంటలు సరిగా చేయాలని బాలేదని చెప్పడంతో మరొక రోజు మంచిగా చేస్తూ తరువాత రోజు మురుగు నీటితో వంటలు చేయడంతో యజమానికి అనుమానం వచ్చి ఆమెకు తెలియకుండా వంట గదిలో సిసి కెమెరా ను పెట్టడంతో ఆమె చేస్తున్న ఘోరం బయటపడింది.ప్రతీ రోజు ఆమె మురుగు నీటిని భోజనం తయారికి వాడుతోందని గ్రహించిన యజమాని ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకుని హత్యా నేరం కేసు ఫైల్ చేశారు.ఈ ఘటనపై సీరియస్ అయిన క్యాపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ జనరల్ అబ్దీన్ అల్ ఆమెను దేశం నుంచీ బహిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.