రాత్రంతా మొబైల్ ఫోన్ ఛార్జ్ పెడితే ఏమవుతుంది? ఇలా చేయడం ఎంత వరకు సరైనదో తెలుసా?

మీరు రాత్రిపూట మీ ఫోన్‌ను ఛార్జ్‌ చేస్తున్నప్పుడు.దీని వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుందనో లేక ఫోను పేలిపోయే ప్రమాదం ఉందనో.

 Does Over Night Charge Harms Our Mobile Phone Battery Myth , Mobile Phone , Pho-TeluguStop.com

లాంటి ప్రశ్నలన్నీ మీ మదిలో మెదులుతూనే ఉంటాయి.చాలా మంది మొబైల్‌ను రాత్రిపూట ఛార్జ్‌లో ఉంచడం ఉత్తమమని అనుకుంటారు.

అప్పుడు రోజంతా ఇబ్బంది లేకుండా మొబైల్‌ని ఉపయోగించ వచ్చనుకుంటారు.మొబైల్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 6 నుండి 8 గంటల సమయం పడుతుందా?.బ్యాటరీ 100% ఛార్జ్ అయ్యాక ఏమి జరుగుతుంది? ఇంకా ఛార్జ్ చేస్తూనే ఉంటుందా? అనే ప్రశ్నలు కూడా ఎదురవుతాయి.వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది స్మార్ట్‌ఫోన్‌ల యుగం.మీ మొబైల్ కూడా ఇప్పుడు స్మార్ట్‌గా మారింది.

మీ స్మార్ట్‌ఫోన్ కూడా 100% ఛార్జ్ తర్వాత ఛార్జింగ్‌ను ఆపివేస్తుంది.

గతంలో మొబైల్ ఫోన్‌లలో ఇటువంటి సమస్యఉంది.

కానీ ఇప్పుడు లేదు.ఇప్పుడు చాలా స్మార్ట్‌ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉంది.

బ్యాటరీ ఫుల్ అయినప్పుడు మొబైల్ ఛార్జింగ్ ఆగిపోతుంది.బ్యాటరీ 90 శాతానికి వచ్చిన వెంటనే మళ్లీ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది.

ఛార్జింగ్ సమయంలో మొబైల్ వేడిగా ఉందని భయపడుతుంటారు.దీనిలో ఆందోళన చెందాల్సిన పనిలేదు.

చార్జింగ్ సమయంలో లిథియం అయాన్ బ్యాటరీ రసాయనిక చర్యకు లోనవుతుందని, బ్యాటరీలోని పాజిటివ్ (+) చాంబర్‌లో ఉండే అయాన్లు నెగటివ్ (-) చాంబర్ వైపు ప్రవహిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఈ ప్రక్రియలో బ్యాటరీ వేడెక్కుతుంది.

అది మొబైల్ వెనుక వైపు మనకు తెలుస్తుంది.ఈ విషయంలో భయపడాల్సిన పనిలేదు.

ఏదిఏమైనా రాత్రంతా మొబైల్ చార్జింగ్ చేయకుండా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube