పివి సింధు ఈ పేరు తెలియని భారతీయుడు లేడు.ఎన్నో పతకాలు సాధించి ఇండియాకు గొప్ప పేరు తెచ్చి పెట్టింది.
మాములుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే సాంగ్స్ కు స్టెప్ వేస్తే ఆ కథ వేరేలా ఉంటుంది.అలాంటిది పివి.
సింధు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్స్ కు డ్యాన్స్ వేసి అదరగొట్టింది.
ఈ మధ్య బాగా పాపులర్ అయిన మాయకిర్రియే పాటకు డ్యాన్స్ వేసి అభిమానులను ఆకట్టుకుంటోంది.
రెండు సార్లు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన పివి.సింధు కోర్టు లోపలే కాదు, బయట కూడా సూపర్ మూవ్స్ చేయగలను అని నిరూపించింది.
అనిరుధ్ రవిచందన్ స్వయ పరిచి పాడిన ఈ పాట ఇన్ స్టా గ్రాంలో జనాదరణ పొందింది.ఈ 26 ఏళ్ల బ్యాడ్మింటన్ భామ వైరల్ ట్రెండ్ లో పాల్గొనడం మొదటిసారి కాదు.
గత వారం కచ్చాబాదం పాటకు దానికి ముందు లవ్ న్వటింటీ అనే సాంగ్స్ కి స్పందించింది.తాజాగా డ్యాన్స్ ఈజ్ జాయ్ ఆప్ మూమెంట్ అంటూ చేసిన వీడియోకి గంటలోపే 3.7లక్షల వ్యూస్ వచ్చాయి.కచ్చా బాదం సాంగ్ ఏకంగా 8 లక్షల వ్యూస్ దాటేసింది.

ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పివి.సింధు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.క్రీడల్లో కాదు డ్యాన్స్ కూడా వేయగలను అని నిరూపిస్తోంది.
పివి.సింధు డ్యాన్స్ తో పాటు ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఈ డ్యాన్స్ తో పివి.సింధు ఫాలోవర్స్ కూడా పెరగడం హర్షనీయం
.






