తెలుగులో తక్కువ సినిమాలే చేసినా నోయల్ మాజీ భార్య ఎస్తర్ కు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.ఎస్తర్ పూర్తి పేరు ఎస్తర్ నోరోన్హా కాగా 2012 సంవత్సరంలో నటిగా ఈమె కెరీర్ మొదలైంది.
హిందీ సినిమాలతో బాలీవుడ్ లో కెరీర్ ను మొదలుపెట్టిన ఎస్తర్ వెయ్యి అబద్ధాలు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయ మయ్యారు.భీమవరం బుల్లోడు సినిమా నటిగా ఎస్తర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఎస్తర్ నటించిన 69 సంస్కార్ కాలనీ ఈ నెల 18వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎస్తర్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
తాను ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో రొటీన్ సినిమాలు ఎక్కువగా ఉండేవని ఆ సినిమాలలో రొటీన్ పాత్రలు ఉండేవని ఎస్తర్ అన్నారు.తాను నచ్చిన సినిమాలకు మాత్రమే ఓకే చెబుతానని ఎస్తర్ తెలిపారు.
క్వాలిటీ సినిమా చేయాలని ఆలోచన తనదని ఆమె వెల్లడించారు.క్యాస్టింగ్ కౌచ్ ప్రతి ఇండస్ట్రీలో ఉందని సినిమా రంగంలో మరింత ఎక్కువగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
నాకు యాక్టింగ్ చేయడంలో, పాటలు పాడటంలో ఆనందం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.రెమ్యునరేషన్ కంటే తాను కథకు ప్రాధాన్యత ఇస్తానని ఆమె తెలిపారు.
సునీల్ తనకు మెంటార్ లాంటి వ్యక్తి అని ఆమె తెలిపారు.

సునీల్ ఇంటి మనిషి లాంటి వ్యక్తి అని ఆమె అన్నారు.సునీల్, తాను ఒకే వాహనంలో ప్రమోషన్స్ కు వెళ్లేవాళ్లమని ఎస్తర్ అన్నారు.ఆ సమయంలో తనకు నిద్ర వస్తే తనకు బ్యాక్ సీట్ ఇచ్చి సునీల్ ఫ్రంట్ సీట్ లో కూర్చునేవారని సునీల్ తనను చిన్నపిల్లలా చూసేవారని ఎస్తర్ కామెంట్లు చేశారు.
భీమవరం బుల్లోడు ఎన్నో మంచి మెమొరీలను ఇచ్చిందని ఎస్తర్ తెలిపారు.







