ప్రముఖ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.బుల్లితెరపై రికార్డు స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ షో ఓటీటీలో కూడా అదే రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బిగ్ బాస్ గత సీజన్ల కంటెస్టెంట్లతో పాటు కొత్త కంటెస్టెంట్లు కూడా పాల్గొన్నారు.అయితే ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారు అనే చర్చ జోరుగా జరుగుతోంది.
ముమైత్ ఖాన్, శ్రీ రాపాక ఈ షో నుంచి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయ్యారు.ఈ వారం ఈ షో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది.
అయితే బిగ్ బాస్ సీజన్2 విన్నర్ కౌశల్ మాత్రం బిగ్ బాస్ నాన్ స్టాప్ కు బిందు మాధవి విన్నర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పు కొచ్చారు.బిగ్ బాస్ షో తర్వాత కౌశల్ సినిమా ఆఫర్లతో బిజీ కాక పోయినా ఇతర ఆఫర్లతో బిజీ అయ్యారు.
తాజాగా కౌశల్ బిగ్ బాస్ షో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిగ్ బాస్ షో ఎవరు గెలుస్తారనే విషయంలో తన అంచనాలు ఎప్పుడూ తప్పలేదని కౌశల్ చెప్పుకొచ్చారు.
బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించిన కొన్ని ప్రోమోలను చూశానని తన అంచనాల ప్రకారం బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బింధుమాధవి గెలుస్తుందని కౌశల్ అన్నారు.బింధుమాధవి సామర్థ్యాలతో పాటు యాటిట్యూడ్ ఆమె గెలవడానికి కారణమవుతాయని కౌశల్ చెప్పుకొచ్చారు.
బిగ్ బాస్ విన్నర్ విషయంలో కౌశల్ జోస్యం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ హౌస్ కు రీఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ల గురించి కౌశల్ మాట్లాడుతూ రీఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు బిగ్ బాస్ గేమ్ ను అర్థం చేసుకోవడంలో తడబడుతున్నారని కౌశల్ వెల్లడించారు.