హోలీని దేశంలోని వివిధ ప్రాంతాలలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు.మహారాష్ట్రలోని బీడ్‌లో హోలీ వేళ.
వింత సంప్రదాయం కొనసాగుతుంటుంది.బీడ్ జిల్లా కేజ్ తహసీల్‌లోని విదా యెవతా గ్రామంలో హోలీ రోజున గాడిదపై అల్లుడిని ఊరేగించి రంగులు పూసే ఆచారం కొనసాగుతుంది.
దాదాపు 80 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.చాలా మంది హోలీలో రంగులకు దూరంగా ఉంటారు.బలవంతంగా రంగులు పూసే వ్యవహారంలో కొట్లాటలు కూడా జరుగుతాయి.బురా నా మనో హోలీ హై అనే మాట కూడా అంటారు.80 ఏళ్ల క్రితం ఒక విచిత్ర ఘటన జరిగింది.80 ఏళ్ల క్రితం బీడ్ జిల్లా కేజ్ తహసీల్‌లోని విదా యెవతా గ్రామంలో దేశ్‌ముఖ్ కుటుంబానికి చెందిన అల్లుడు హోలీ రంగులు పూయించుకోడానికి నిరాకరించాడు.అప్పుడు అతని అత్తయ్య రంగు పూసుకునేందుకు అతనిని ఒప్పించడానికి ప్రయత్నించింది.
పూలతో అలంకరించిన గాడిదను తీసుకువచ్చి.దాని మీద అల్లుడిని కూర్చోబెట్టి గ్రామంలో తిప్పారు.ఆ అల్లుడిని గాడిదపై గుడికి తీసుకెళ్లారు.
అక్కడ అల్లునికి హారతి ఇచ్చారు.ఆయనకు కొత్త బట్టలు, బంగారు ఉంగరం బహూకరించారు.
అక్కడ అతని ముఖంపై రంగు పూశారు.ఆ ఊరిలో ఏటా ఇలా జరగడం ఆనవాయితీగా వస్తోంది.
ఇప్పుడు ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం హోలీ నాడు కొత్తగా పెళ్లయిన అల్లుళ్లు కనిపిస్తారు.ఈ సంప్రదాయాన్ని కొత్త అల్లుడితో హోలీ నాడు నిర్వహిస్తారు.
ఈ సందడి నుంచి తప్పించుకునేందుకు గ్రామానికి చెందిన కొందరు అల్లుళ్లు ఎక్కడో అక్కడ దాక్కుని పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు.అయితే వారిని గ్రామ ప్రజలు వెదికి పట్టుకువచ్చి రంగులు పూస్తారు.
గత ఏడాది కరోనా కారణంగా ఈ సంప్రదాయం నిర్వహించలేకపోయారు.ఈసారి సంప్రదాయాన్ని నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.







