సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని యానిమల్ వీడియోస్ మనల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి.మరికొన్ని మాత్రం మన కళ్ళను మోసం చేసినట్లుగా ఉంటాయి.
తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.
ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత ఆనంద షేర్ చేశారు.దీనికి ఇప్పటికే 70 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిరుతపులి మూడు కాళ్ల జింకను వేటాడడానికి పొంచి ఉండటం గమనించవచ్చు.అలా అది అదునుచూసి ఒక్కసారిగా జింక మీదకి జంప్ చేసింది కానీ మధ్యలో ఒక ఇనుప కంచె ఉంది.
దీంతో చిరుత జింకను పట్టుకోలేక పోయింది.అయితే తనను తినేందుకు చిరుత ప్రయత్నిస్తుందని తెలిసినా కూడా జింక మాత్రం కొంచెం కూడా బెదరలేదు.
అది చాలదన్నట్టు, దమ్ముంటే నన్ను చంపేయ్ అన్నట్లుగా అది పులి ముందుకు వెళ్లి మరీ మేత మేయడం ప్రారంభించింది.ఈ క్రమంలో చిరుత దాన్ని పట్టుకునేందుకు చాలాసార్లు ప్రయత్నించింది.
ఇవన్నీ కళ్ళముందు కనిపిస్తున్నా జింక మాత్రం అలాగే చిరుత ముందు మేస్తూ దాన్ని ఒక ఆట ఆడించింది.తర్వాత ఇవాళ్టికి నిన్ను ఆడింది.
చాలు ఇక బాయ్ అన్నట్లుగా అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది.దీంతో చిరుత నిరాశతో వెనుదిరిగింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.“ఈ జింక ఆటిట్యూడ్ మామూలుగా లేదు.తనని చంపే చిరుత దగ్గరలో ఉందని తెలిసినా ఇది వెనకడుగు వేయలేదు.ఇది చాలా డేర్ డెవిల్.జింకకి ఓ రోజు వచ్చింది.అందుకే చిరుతను ఇలా ఒక ఆట ఆడేసుకుంది.” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







