ప్రసవం తర్వాత ఆడవారిని తీవ్రంగా కలవర పెట్టే సమస్యల్లో స్ట్రెచ్ మార్క్స్ ముందు వరసలో ఉంటాయి.అందంగా, స్మూత్‌గా ఉండే చర్మాన్ని స్ట్రెచ్ మార్క్స్ అందవిహీనంగా మార్చేస్తాయి.
అందుకే వీటిని వదిలించు కోవడం కోసం ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన క్రీములను, లోషన్లను కొనుగోలు చేసి వాడుతుంటారు.
కానీ, వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చు.అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్‌ను యూజ్ చేస్తే గునుక సులభంగా స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టు కోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షలు, కప్పు వాటర్ పోసి నైటంతా వదిలేయాలి.
ఉదయాన్నే మిక్సీ జార్లో వాటర్‌తో సహా ఎండు ద్రాక్షలను వేసి మెత్తగా గ్రౌండ్ చేసుకుని.జ్యూస్‌ను వేరు చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో ఎండు ద్రాక్షల జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ పాల పొడి, వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా స్పూన్‌తో తిప్పు కుంటూ స్లో ఫ్లేమ్‌పై పది నిమిషాల పాటు ఉడికించుకుంటే క్రీమీగా మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న మిశ్రమాన్ని చల్లార బెట్టుకోవాలి.
ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ప్యూర్ అలోవెర జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసి బాగా కలుపుకుంటే క్రీమ్ సిద్ధమైనట్టే.ఒక బాక్స్‌లో ఈ క్రీమ్‌ను నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టు కుంటే పది రోజుల పాటు వాడు కోవచ్చు.నైట్ నిద్రించే ముందు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట ఈ క్రీమ్‌ను అప్లై చేసి కాసేపు మసాజ్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక స్ట్రెచ్ మార్క్స్ క్రమంగా తొలగి పోయి చర్మం స్మూత్‌గా మారుతుంది.