అరెస్టయిన పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ... కారణమేంటంటే...

పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మ అందరికీ సుపరిచితులే.ఒక స్కూల్ టీచర్ కుమారుడైన విజయ్ శేఖర్ పేటీఎం స్థాపించి దాన్ని కోట్లాది రూపాయల కంపెనీగా మార్చాడు.

 Arrested Paytm Founder Vijay Shekhar Sharma Arrest, Paytm Founder, Latest News,-TeluguStop.com

అయితే ఆయనకు సంబంధించిన ఒక షాకింగ్ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అదేంటంటే ఢిల్లీ పోలీసులు గత నెలలో విజయ్ శేఖర్ శర్మను అరెస్టు చేశారు.

అనంతరం అదే రోజున బెయిల్ పై అతడిని రిలీజ్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం విజయ్ శేఖర్ శర్మను అరెస్ట్ ఎందుకు చేశారంటే.

 ఫిబ్రవరి 22న విజయ్ శేఖర్ శర్మ తన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారులో ఢిల్లీలోని అరబిందో మార్గ్ లో వేగంగా వెళుతున్నాడు.అయితే మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద శర్మ.

డీసీపీ (సౌత్ ఢిల్లీ) బెనితా మేరీ జైకర్ కారును ఆయన తన కారుతో ఢీ కొట్టాడు.ఆ టైంలో కారులో డీసీపీ అధికారి లేరని పోలీసులు తెలిపారు.

ఆ కారులో డీసీపీ డ్రైవర్, కానిస్టేబుల్ దీపక్ కుమార్ ఉన్నాడు.అతడు డీసీపీ కారుకు డాష్ ఇచ్చిన విజయ్ కారు నెంబర్ ను వెంటనే నోట్ చేసుకున్నాడు.

ఆ తర్వాత నెంబర్ ఆధారంగా కారు ఓనర్ ఎవరో చెక్ చేయగా పేటీఎం విజయ్ శర్మ అని తేలింది.తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేశారనే అభియోగంతో ఐపీసీ సెక్షన్ 279 కింద విజయ్ శర్మ పై సౌత్ ఢిల్లీ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ నేరం చిన్నది కాబట్టి వెంటనే బెయిల్ పై విజయ్ శర్మను విడుదల చేశారు.

Telugu Latest, Paytm Founder, Vijayshekhar-Latest News - Telugu

ఇదిలా ఉండగా విజయ్ శర్మ పై వస్తున్న వార్తా కథనాలపై పేటీఎం ప్రతినిధి స్పందించాడు, “ఒక చిన్న కారు యాక్సిడెంట్ కు సంబంధించి ఫిర్యాదు దాఖలైంది.ఈ ఘటనలో ఏ వ్యక్తికి గానీ, ఆస్తులకు గానీ ఎలాంటి నష్టం జరగలేదు.చట్ట పరమైన ఫార్మాలిటీలను అదే రోజు పూర్తి చేసినందున పోలీసులు వెంటనే విడుదల చేశారు.అరెస్ట్ గురించి మీడియా వర్గాలు ఏదో ఘోరం జరిగిపోయినట్లు వార్తలు రాస్తున్నాయి.

ఇది చాలా చిన్నది” అని ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube