ఆప్ ఫోక‌స్ ఇక తెలుగు రాష్ట్రాల‌పైనే ?

ఒకే రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రాంతీయ పార్టీగా ఆమ్ ఆద్మి పార్టీ(ఆప్‌) కొన‌సాగిన విష‌యం తెలిసిందే.తాజాగా ఆ పార్టీ జాతీయ పార్టీగా మారింది.

 Is Aap Focus On Telugu States , National Politics, Aap,-TeluguStop.com

పంజాబ్‌లో ఘ‌న విజ‌యం సాధించి సంచ‌ల‌నం క్రియేట్ చేసింది.ప్ర‌స్తుతం బీజేపీ, కాంగ్రెస్ కాకుండా రెండు రాష్ట్రాల్లో అధికారం ద‌క్కించుకున్న మూడో పార్టీగా ఆప్ చ‌రిత్ర‌ను సృష్టించింది.

ఒక‌విధంగా చెప్పాలంటే జాతీయ రాజ‌కీయాల్లో కాంగ్రెస్ స్థానాన్ని భ‌ర్తీ చేసి బీజేపీకి పోటీనిచ్చే సామ‌ర్ధ్యం ఒక్క ఆప్‌కే ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.ఇదే జోరుతో దేశంలోని మిగ‌తా రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు ఆప్ క‌స‌ర‌త్తులు చేస్తోంద‌ని టాక్‌.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల‌పైనే ఫోక‌స్ పెట్టింద‌నే స‌మ‌చారం చ‌క్క‌ర్లు కొడుతోంది.అయితే ఇక్కడ రాజ‌కీయంగా ఎదుగాలంటే పాద‌యాత్ర‌లు దోహ‌ద‌ప‌డ‌తాయి.దీనికి అధిక ప్రాధాన్య‌త ఇస్తారు.ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు త‌ర‌చూ రాజ‌కీయ నేత‌లు పాద‌యాత్ర‌లు చేయ‌డం విధిత‌మే.

ఇదే బాట‌లో ఆప్ కూడా పాద‌యాత్ర‌లు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంద‌ని స‌మాచార‌.తెలంగాణ‌లోనూ పంజాబ్ రాష్ట్ర ప‌రిస్థితులే ఉన్నాయ‌ని, సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని ఆప్ రాష్ట్ర వ్య‌వ‌హారాల బాధ్యుడు సోమ‌నాథ్ భార‌తి పేర్కొన‌డం హాట్ టాపిక్ మారింది.

అయితే తెలంగాణ‌లో ఆప్ పార్టీ విస్త‌రించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిపారు.ఇచ్చిన హామీల‌ను సీఎం కేసీఆర్ నెర‌వేర్చ‌లేద‌ని, నిధులు ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని ఆరోపించారు.

టీఆర్ఎస్‌లో ప్ర‌జాస్వామ్యం లేద‌ని, ఆపార్టీ నేత‌లు ఆప్‌లోకి రావాల‌ని కోరారు.ఇక ఏపీలోనూ ఆప్ విస్త‌ర‌ణ‌కు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలిసింది.

ఇప్ప‌టికే స్తానిక ప‌రిస్థితుల‌పై స‌ర్వేలు చేప‌ట్టిన‌ట్టు టాక్.రాజ‌కీయ ప‌రిణామాల‌పై అంచ‌నాకొచ్చిన త‌రువాత బ‌రిలో దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్న‌ద‌ని స‌మాచారం.

మొత్తానికైతే 2024 ఎన్నిక‌ల నాటికి ఏపీలో టీడీపీ గానీ, జ‌న‌సేన‌తో గానీ పొత్తు పెట్టుకోవాల‌ని, లేదంటే ఒంట‌రిగా భ‌రిలోకి దిగాల‌ని ఆప్ ప్లాన్ అని తెలుస్తోంది.మ‌రోవైపు అంబేద్క‌ర్ జ‌యంతి ఏ్ర‌పిల్ 14 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ని శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ‌ల్లో పాద‌యాత్ర‌లు చేప‌ట్టేందుకు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు చేస్తోందిని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

స‌ర్వేల ద్వారా ఆప్‌కు అనుకూలించే అంశాల‌ను గుర్తించి ఒక అంచ‌నాకొచ్చిన త‌రువాత ఆప్ పార్టీ విస్త‌ర‌ణ చేప‌డుతుంద‌ని టాక్‌.

Is AAP Focus On Telugu States

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube