బిగ్ బాస్ లో పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా ఏ విధంగా ఉంటాయి అన్నది అంచనా వేయడం చాలా కష్టం.ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు కలిసి ఉన్న కంటెస్టెంట్ లు మరికొద్ది సేపటికి పోట్లాడుకోవచ్చు.
కంటెస్టెంట్ లో కూడా ఎప్పుడు ఏ విధంగా మారుతారో చెప్పలేం.ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది వారి మాటే నెగ్గాలి, చెప్పినట్టు వినాలి అంటూ ఇగో ని ప్రదర్శిస్తూ ఉంటారు.
ఇక తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ 5 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం బిగ్ బాస్ షో అంటూ ప్రసారమవుతోంది.
అయితే గత సీజన్ లతో పోల్చుకుంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనివిధంగా బూతులు మాట్లాడుతూ, బిగ్ బాస్ ని కూడా తిడుతూ, చివరికి కొట్టుకునే వరకు వెళ్లారు.
ఇక ఇప్పటికే మొదటి ఎలిమినేషన్ పూర్తి కాగా ఈ రోజు 2 వ ఎలిమినేషన్ జరగబోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు అందరూ బిందు మాధవిని టార్గెట్ చేశారు.అసలేం జరిగిందంటే.బిగ్ బాస్ హౌస్ లో బిందుమాధవి ఆటతీరును బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ ని చూస్తున్న వీక్షకులు ప్రశంసించిన విషయం తెలిసిందే.
అయితే ఎప్పుడైతే నాగార్జున తో పాటు ఆడియన్స్ కూడా బిందుమాధవి ని బాగా ఆడుతుంది అని పొగిడారో, ఇక అప్పటి నుంచీ అఖిల్ సార్థక్ ముఖంలో నవ్వు కనుమరుగయ్యింది.ఇతనితో పాటు తేజస్వి, నటరాజ్ మాస్టర్ కూడా బిందు మాధవిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.హోస్ట్ నాగార్జున బిందు మాధవిని ప్రశంసించడం అఖిల్ తో పాటు, అజయ్, తేజస్వి, నటరాజ్ మాస్టర్ లకు కూడా నచ్చడం లేదు.దీనితో వీరందరూ ఒక బ్యాచ్ గా మారిపోయి బిందు మాధవిని టార్గెట్ చేశారు.
తాజాగా కెప్టెన్సీ టాస్క్ ముగిసిన తరువాత.ఈవారం వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అన్న దానిపై చర్చ నడిచింది.
అప్పుడు అఖిల్,అజయ్, నటరాజ్ మాస్టర్,తేజస్వి లు బిందు మాధవి పేరు ను చెప్పారు.అందుకు సంబందించిన ప్రోమో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.