మన దేశంలో రైలు ఆలస్యంగా రావడం మామూలే.కానీ జపాన్‌లో ఇలా అస్సలు జరగదు.
జపాన్ రైళ్ల సమయం గురించి చాలా ఆసక్తికర వివరాలున్నాయి.ఇక్కడ రైళ్ల రాకతో తమ గడియారాల సమయాన్ని సరిచేసుకుంటారని చెబుతారు.
అయితే జపాన్‌లో కూడా కొన్నిసార్లు సాంకేతిక లోపాల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి.జపాన్ ప్రజలు సమయపాలన పాటిస్తారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రతి విభాగంలోనూ సీరియస్‌గా తీసుకుంటారు.అది ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ఒకేలా ఉంటుంది.
కొన్నిసార్లు రైలు కొన్ని సెకన్లు ఆలస్యంగా వస్తుంది.ఫలితంగా తదుపరి రైలు కూడా ఆలస్యమవుతుంది.
ఇటువంటి సందర్భాల్లో జపాన్ రైల్వే ప్రయాణికులకు సర్టిఫికేట్లను అందిస్తుంది.దానిలో రైలు ఆలస్యం గురించి పూర్తి సమాచారం ఉంటుంది.రైలు ఆలస్యమైనప్పుడు, రైల్వే సిబ్బంది స్టేషన్‌లో నిలుచుని, ప్రయాణీకులకు ఆలస్య ధృవీకరణ పత్రాన్ని ఇస్తారు.ప్రయాణికులు తమ కార్యాలయంలో దీనిని చూపిస్తే, ఆలస్యంగా వచ్చిన వారిపై చర్యలు తీసుకోరు.
జపాన్ రైల్వే అధికారులు రైలు ఆలస్యానికి బహిరంగంగా క్షమాపణలు చెబుతారు.

గత నవంబర్‌లో, టోక్యో ఉత్తర ప్రాంతాన్ని కలిపే సుకుబా ఎక్స్‌ప్రెస్ లైన్‌లో రైలు 9: 44 :40కి బదులుగా 9:44:20కి బయలు దేరిందని గార్డియన్ నివేదికలో తెలిపారు.రైలు కేవలం 20 సెకన్ల ముందుగా బయలుదేరడంతో కొందరు ప్రయాణీకులు రైలును మిస్సయ్యారు, మరికొందరు ప్రయాణికులు తదుపరి స్టేషన్‌లో రైలు కోసం వేచి ఉండవలసి వచ్చింది.ఈ ఘటనపై రైల్వే అధికారులు తమ వెబ్‌సైట్‌లో క్షమాపణలు తెలిపారు.
సుకుబా ఎక్స్‌ప్రెస్ కంపెనీ.మా వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది.







