యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ అభిమానులకు, క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంటే ఇతర హీరోల అభిమానులు మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలకు అనుగుణంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాధేశ్యామ్ సినిమా తుది ఫలితం తెలియాలంటే మాత్రం ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే.
హైదరాబాద్ లోని చాలా థియేటర్లలో రాధేశ్యామ్ సినిమాకు ఈరోజు, రేపు టికెట్లు భారీస్థాయిలో అందుబాటులో ఉండటం గమనార్హం.
ప్రమోషన్స్ లో వేగం పెంచితే రాధేశ్యామ్ సినిమాకు ప్లస్ అవుతుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
ప్రభాస్ సినిమాలలో తనకు ఏక్ నిరంజన్ నచ్చదని శ్యామలాదేవి తెలిపారు.
రాధేశ్యామ్ సినిమా కోసం చాలా కష్టపడ్డామని శ్యామలాదేవి అన్నారు.
ప్రభాస్, కృష్ణంరాజు ఖర్చు విషయంలో రాజీ పడరని శ్యామలాదేవి వెల్లడించారు.

రాధేశ్యామ్ అద్భుతమైన దృశ్య కావ్యమని శ్యామలాదేవి అన్నారు.ప్రభాస్ లైట్ బాయ్ నుంచి అందరికీ భోజనం వెళ్లేలా చూసుకుంటారని శ్యామలాదేవి వెల్లడించారు.ఏ ఐటమ్ మిస్ అయినా ప్రభాస్ ఒప్పుకోరని శ్యామలాదేవి అన్నారు.

బిల్లా మూవీ విదేశాల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో ఇక్కడి నుంచి కుక్ ను తీసుకెళ్లామని జూనియర్ ఎన్టీఆర్ ఆ సమయంలో అదే ప్లేస్ లో ఉంటే క్యారేజీ పంపామని శ్యామలా దేవి తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ “ఇక్కడ కూడా వదలరా మీరు.మీ తండ్రీ కొడుకులు ఫుడ్ పెట్టీ చంపేస్తారా” అంటూ ప్రభాస్, కృష్ణంరాజు గురించి కామెంట్లు చేశారని ఆమె తెలిపారు.కృష్ణంరాజు తన పుణ్యం ప్రభాస్, ముగ్గురు ఆడపిల్లలు అని భావిస్తాడని తెలిపారు.
రాధేశ్యామ్ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.







