రాధేశ్యామ్ సినిమాతో ప్రభాస్ కి అదిరిపోయే బిజిఎం ఇచ్చాడు థమన్.ఈమధ్య వరుస స్టార్ సినిమాలకు అదరగొట్టే ఆర్.
ఆర్ ఇస్తూ వస్తున్న థమన్ తన సత్తా చాటుతున్నాడని చెప్పొచ్చు.రాధేశ్యామ్ సినిమా కోసం థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ గా మాట్లాడుకునేలా చేస్తుంది.
అందుకే థమన్ కి డార్లింగ్ ప్రభాస్ మరో క్రేజీ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు థమన్ మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ చేశాడని తెలుస్తుంది.
ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న రాజా డీలక్స్ సినిమా కోసం థమన్ మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.ఈమధ్య థమన్ చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందు కుంటున్నాయి.
అఖండ, భీమ్లా నాయక్ లతో పాటుగా రాధేశ్యామ్ సినిమాతో హ్యాట్రిక్ అందు కున్నాడు థమన్.ఇక మీదట థమన్ మ్యూజిక్ ఉంటే సినిమా సగం హిట్ అయినట్టే లెక్క అని చెప్పొచ్చు.
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఆల్రెడీ ఆ సినిమా నుండి వచ్చిన కళావతి సాంగ్ ఇప్పటికే సెన్సేషనల్ హిట్ అయ్యింది.







