బాహుబలి రెండు పార్టులతో నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహోతో జస్ట్ ఓకే అనిపించు కున్నాడు.ఇక లేటెస్ట్ గా రాధేశ్యామ్ సినిమాతో మెప్పించాడు ప్రభాస్.
రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకు ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు.
రాధేశ్యామ్ సినిమాలో ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు.అంతే కాదు మొన్నటి వరకు గ్లామర్ షో చేసి మాత్రమే పూజా నెట్టుకు వచ్చిందని ఆమెకి అంతగా నటించడం రాదని అన్నారు.
రాధేశ్యామ్ సినిమా చూస్తే మాత్రం పూజా హెగ్డే ని కూడా సరిగా వాడుకుంటే అద్భుతాలు చేయొచ్చని తెలుస్తుంది.హీరోయిన్స్ కూడా ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తూ వస్తున్నారు.
రాధేశ్యామ్ సినిమాతో పూజా హెగ్దే ప్రేక్షకులకు మరింత దగ్గరైందని చెప్పొచ్చు.ఇదే ఊపుతో సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రం కాంబో మూవీలో కూడా అమ్మడు ఛాన్స్ కొట్టేసింది.
అంతకు ముందు పూజా హెగ్దే చేసిన సినిమాల్లో ఆమె థై షోస్ మీద ఎక్కువ దృష్టి ఉండేది చిన్నగా అమ్మడు కూడా అభినయ తారగా టర్న్ అవుతుంది.







