తెలుగు ప్రేక్షకులకు యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెర ఫై తన యాంకరింగ్ తో మాయ చేసి, ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.
తెలుగు బుల్లితెర పై రాణిస్తున్న ఎంతో మంది యాంకర్ లలో లాస్య మంజునాథ్ కూడా ఒకరు.ఈమె యాంకర్ గా రాణిస్తున్న సమయంలోనే లాస్య పెళ్లిచేసుకుంది.
పెళ్లి తర్వాత కూడా పలు షోలలో సందడి చేసిన లాస్య ఆ తర్వాత నిదానంగా యాంకరింగ్ కు దూరమయ్యింది.అనంతరం నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లాస్య.
బిగ్ బాస్ హౌస్ లో తనదైన మాటలతో, అల్లరితో ఆకట్టుకుంది ఈ భామ.ఇదిలా ఉంటే మరొక సారి బుల్లితెరపై కి ఎంట్రీ ఇచ్చి సందడి సందడి చేస్తోంది.లాస్య ఎక్కువగా చీమ, ఏనుగు జోకులతో బాగా ఫేమస్ అయ్యింది.కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించిన లాస్య ఆ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోస్ తీస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన అత్తారిల్లును అభిమానులకు చూపించే ప్రయత్నం చేసింది.ఈ మేరకు యూట్యూబ్ చానల్‌లో అత్తగారి హోమ్ టూర్ వీడియోను షేర్ చేసింది.
తన భర్త మంజునాథ్ తాతయ్య ఆ ఇంటిని 25 వేల రూపాయల కె కట్టించాడని తెలిపింది.

ఆ ఇంటిని కట్టించి దాదాపు 50 ఏళ్లు అవుతుందని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.ఇప్పుడు అత్తామామ తమతో పాటే సిటీలో ఉంటున్నారని, త్వరలోనే ఈ ఇల్లును అమ్మేయబోతున్నట్లు వెల్లడించింది.ఇక ఈ ఇంటికి రెండు గుమ్మాలతో పాటు విశాలమైన గదులు,హాల్, డైనింగ్ టేబుల్ రూమ్, రెండు కిచెన్లు, దేవుడి రూమ్, బెడ్ రూమ్స్, స్టోర్ రూమ్ ఉన్నాయి.
అంతే కాకుండా మోడ్రన్ మహాలక్ష్మి షోలో ఒక ఫ్రిజ్ గెలిచానని, అది తన ఇంట్లోనే ఉంది అంటూ ఆ ఫ్రిడ్జ్ ని చూపించింది లాస్య.అలాగే ఆ ఇంటికి సంబందించిన ఎన్నో విషయాలను ఆ వీడియోలో పంచుకుంది.
ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.







