తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా కేసీఆర్ చేసిన ఉద్యోగాల ప్రకటనతో వేడెక్కాయి.అయితే కేసీఆర్ చేసిన ఉద్యోగాల ప్రకటనతో ఇక కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు కొద్దిగా విమర్శిస్తుండటం కాంగ్రెస్ చేసిన పోరాటం వల్ల మాత్రమే నిరుద్యోగులకు నోటిఫికేషన్ లు విడుదల చేయాలనే సోయి కలిగిందని వ్యాఖ్యానిస్తుండగా షర్మిల తమ పార్టీ చేసిన పోరాటం వల్ల మాత్రమే ప్రభుత్వం దిగి వచ్చిందని ఇక లేకపోతే ఎప్పటికీ కూడా ఉద్యోగ ప్రకటన అనేది ఉండే అవకాశం లేదని ఇది పూర్తిగా వైయస్సార్ తెలంగాణ పార్టీ సాధించిన విజయం అని షర్మిల క్రెడిట్ దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది.
ఏది ఏమైనా క్రెడిట్ కోసం పార్టీలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ అసెంబ్లీ లో ప్రకటన సమయంలో చూపిన ఆ వైవిధ్యంతో చాలా వ్యూహాత్మకంగా కదిలిన పరిస్థితి ఉంది.
అందుకే కేవలం ప్రకటన మాత్రమే చేసిన కెసీఆర్ ఇక రాజకీయ వ్యాఖ్యలకు కాస్త దూరంగా ఉండటంతో ఇక ప్రతిపక్షాలు విమర్శించడానికి ఏ ఒక్క అవకాశం కూడా లేకపోయింది.ఒక వేళ కెసీఆర్ రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసి ఉంటే ఇక ఈ ప్రకటన విషయం అనేది అంతగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉండేది కాదు.
అందుకే కెసీఆర్ కేవలం ప్రకటనపై మాత్రమే దృష్టి పెట్టి ఒక్కసారిగా ప్రతిపక్షాలకు క్రెడిట్ దక్కకుండా పన్నిన వ్యూహం చాలా విజయవంతమయినదని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ సారి ఉద్యోగాల భర్తీ అనేది విజయవంతంగా చేపడితే ఇక కెసీఆర్ కు తిరుగులేదని చెప్పవచ్చు.
ఇఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయ వాతావరణం అనేది ఒక్కసారిగా మారిపోయిన విషయాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక ప్రతిపక్షాలు దీనిపై రానున్న రోజుల్లో ఎలా స్పందిస్తాయనేది చూడాల్సి ఉంది.







