ప్రభాస్ విదేశాలకు అందుకే వెళ్తాడట.. అది కూడా 'బాహుబలి' రిలీజ్ అవ్వని ప్రాంతాలకు..

టాలీవుడ్ టాప్ హీరోల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకరు.ఈయన బాహుబలి సినిమాతో తన మార్కెట్ ను పాన్ ఇండియా లెవల్లో పెంచుకున్నాడు.

 Radhe Shyam Promotions , Prabhas , Radhe Shyam , Promotions , Saho , Tollywood-TeluguStop.com

ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమా సాహో.

ఈ సినిమా మన టాలీవుడ్ లో ప్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ బాలీవుడ్ లో మాత్రం భారీ కలెక్షన్స్ సాధించింది.

Telugu Bahubali, Bollywood, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Saho, Tollywood-M

సాహో సినిమాతో ప్రభాస్ కు పాన్ ఇండియా లెవల్లో ఎంత మార్కెట్ ఉందో రుజువు చేసుకున్నాడు.మరి ఇప్పుడు రాబోతున్న రాధేశ్యామ్ సినిమాతో తన మార్క్ చూపించడానికి రెడీ అవుతున్నాడు.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కాబోతుంది.

Telugu Bahubali, Bollywood, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Saho, Tollywood-M

ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నాడు.ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ కు ఒక ప్రశ్న ఎదురైంది.ప్రభాస్ ఖాళీ దొరికితే చాలు విదేశాలకు చెక్కేస్తూ ఉంటాడు.

అలా ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్తూ ఉండడంతో ఏం చేస్తుంటారు అక్కడికి వెళ్లి అనే అనుమానం ఆయన అభిమానుల్లో కూడా ఉంటుంది.ఇప్పుడు ఆయనకు ఇంటర్వ్యూలో కూడా అదే ప్రశ్న ఎదురైంది.

మీరు తరచు విదేశాలకు వెళ్తూ ఉంటారు కదా అక్కడికి వెళ్లి ఏం చేస్తారు అనే ప్రశ్న ఆయనను అడగగా.అప్పుడు ప్రభాస్ ‘పని ఒత్తిడి నుండి బయట పడేందుకు నేను విదేశాలకు వెళ్తూ అక్కడ నా స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను.

ట్రావెలింగ్ అంటే నాకు చాల ఇష్టం.ట్రావెలింగ్ వల్ల ఒత్తిడి మొత్తం పోతుంది.

అక్కడ అందరం కలిసి స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతాము.

Telugu Bahubali, Bollywood, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Saho, Tollywood-M

మార్కెట్ కి వెళ్లి మాకు కావలసినవి అన్ని తెచ్చుకుంటాం.ప్లాట్ ఫామ్ మీద కూర్చుని చాలా సేపు కబుర్లు చెప్పుకుని నాదైన ప్రపంచంలో సరదాగా గడుపుతాను.నాకు నచ్చినట్టుగా ఉండడం కోసమే విదేశాలకు వెళ్తూ ఉంటాను.

అది కూడా బాహుబలి రిలీజ్ అవ్వని దేశాలను ఎంచుకుని మరి వెళ్ళేవాడిని.నన్ను ఎవ్వరు గుర్తు పట్టకూడదని.

కానీ ఈ మధ్య ఏ దేశానికీ వెళ్లిన గుర్తు పడుతున్నారు.అంటూ నవ్వేసాడు ప్రభాస్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube