బీమా ఏజెంట్‌ను 1,13,400 సింగపూర్ డాలర్ల మేర మోసం చేసినందుకు గాను భారత సంతతికి చెందిన దేవకీ గోపాల్ ముత్తు (62) అనే మహిళకు సింగపూర్ కోర్ట్ 20 నెలల 2 వారాల జైలు శిక్షను విధించింది.ఈ మేరకు ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.
ఇదే కేసులో చీఫ్ జస్టిస్, సీనియర్ జడ్జిలా నటించి మోసం చేసిన కేసులో నిందితురాలి కుమారుడు రాజేశ్వర్ వీరప్పన్ ఇప్పటికే కటకటాల పాలయ్యాడు.ముత్తుకు తన మిత్రుడి ద్వారా బీమా ఏజెంట్ అయిన 71 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు న్యాయస్థానం పేర్కొంది.
అప్పటికే ఆమె ప్రియుడు … ఆ వ్యక్తి దగ్గర బీమా తీసుకుని వున్నాడు.నవంబర్ 2016 నుంచి మే 2017 మధ్యకాలంలో తల్లి, కొడుకులు బీమా సొమ్ము కొట్టేయడానికి ప్లాన్ గీశారు.
ఈ మేరకు తమకు కొంత డబ్బు అవసరం పడిందంటూ అతనికి మేసేజ్‌లు పెట్టడం ప్రారంభించారు.తమ అవసరం తీరిన తర్వాత డబ్బును వాపస్ చేస్తామని వాగ్థానం చేశారు.
ఈ క్రమంలోనే ముత్తు కుమారుడు చీఫ్ జస్టిస్ సుందరేష్ మీనన్‌లా, అప్పటి ప్రిన్సిపల్ జిల్లా జడ్జి వంటి న్యాయవ్యవస్థలోని ప్రముఖ సభ్యులుగా నటిస్తూ బీమా ఏజెంట్‌కు కాల్ చేశాడని ఛానెల్ నివేదించింది.అలాగే ముత్తు సైతం సారా గోహ్ అనే కోర్టు సెక్రటరీగా నటిస్తూ.
డబ్బు బదిలీ చేయాలంటూ వేధించసాగింది.తమకు సహకరించని పక్షంలో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఇద్దరూ హెచ్చరించారు.
అలా కొన్ని విడతలుగా 1,13,400 సింగపూర్ డాలర్లను బాధితుడు.ముత్తు , ఆమె కుమారుడు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు.
ఇందుకోసం తెలిసినవాళ్లు, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని.బాకీ తీర్చడానికి ఇబ్బందులు పడ్డాడు.
తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకునేందుకు సైతం నిర్ణయించుకున్నాడని ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో ముత్తుకు 20 నుంచి 22 నెలల పాటు జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్ శుక్రవారం న్యాయస్థానాన్ని కోరాడు.అంతేకాదు కోర్టు కార్యకలాపాలను ఆలస్యం చేసి విలువైన సమయం వృథా కావడానికి కారణమైందని ఆయన వాదనలు వినిపించారు.అయితే ప్రాసిక్యూటర్ వాదనను డిఫెన్స్ లాయర్ రియాచ్ హుస్సేన్ తోసిపుచ్చారు.
తన క్లయింట్‌కు 20 నెలల శిక్ష సరిపోతుందని హుస్సేన్ వాదించారు.