అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలంటే అక్కడ ఉద్యోగ అనుమతి కోసం ఇచ్చే హెచ్1 –బి వీసా ఉండాల్సిందే.ఈ వీసా ఆధారంగానే అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పొందుతారు వలస వాసులు.
విదేశాల నుంచీ ఉద్యోగులను స్పాన్సర్ చేసుకునే కంపెనీలు సైతం ఈ హెచ్1 –బి వీసా ద్వారానే తమ కంపెనీలలోకి వలస వాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటారు.అది కూడా భారత్ నుంచీ ఈ వీసాల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందే వారే అత్యదికంగా ఉంటుంటారు.
అంతేకాదు ఈ వీసాల ఆధారంగా…
హెచ్1 –బి తమ భాగస్వాములను హెచ్-4 వీసాల ద్వారా తమతో పాటు అమెరికా తీసుకుని వెళ్తారు.ఈ వీసాల ద్వారా వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవచ్చు.
అందుకే అమెరికా హెచ్ -1బి వీసాలకు భారీ డిమాండ్ ఉంటుంది.పైగా భారత్ నుంచీ ఈ వీసాల కోసం భారీ స్థాయిలోనే దరఖాస్తులు ఉంటాయి.
అమెరికాలో ప్రఖ్యాత టెక్ కంపెనీలు సైతం భారతీయ టెక్ నిపుణులకె మొదటి ప్రాధాన్యతను ఇస్తుంటాయి.కేవలం టెక్ నిపుణులే కాకుండా అన్ని రంగాలలో నిపుణులు ఈ హెచ్1 –బి వీసా ఆధారంగానే అమెరికా వెళ్తారు.అయితే

ప్రతీ ఏడాది ఈ హెచ్1 –బి కి పరిమితులు కూడా ఉంటాయి.అమెరికా చట్ట సభల ప్రకారం కేవలం 65 వేల వీసాలను కేటాయించగా, America advanced degree Exemption క్రింద మరో 20 వేల వీసాలను కలిపి మొత్తం 85 వేల వీసాలను అందిస్తారు.అయితే ఈ ఏడాదికి ఈ పరిధిలో దరఖాస్తులు అందాయని తాజాగా అమెరికా USCIS ప్రకటించింది.ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ఆమోదం తదితర పర్యవేక్షణ ఉంటుందని సంభందిత అధికారులు తెలిపారు.