ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసు కుంటుంది.
ఈ సినిమా సాహో రేంజ్ లో వసూళ్ల ను దక్కించు కుంటుంది అంటూ అంత నమ్మకం గా ఎదురు చూస్తున్నారు.తెలుగు లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను అత్యంత వైభవం గా విడుదల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా వేయడం జరిగింది.తాజాగా కొత్త విడుదల తేదీ ప్రకటించండం.
విడుదల తేది దగ్గరకు రావడం కూడా జరిగిపోయింది.మరో వారం రోజుల్లో రాధేశ్యామ్ సందడి థియేటర్ల వద్ద మొదలు కాబోతుంది.
దేశ విదేశాల్లో కలిపి ఈ సినిమా 10 వేల స్క్రీన్స్ కు పైగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.ఈ సమయం లో సినిమా మలి దశ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు.
నేటి నుండి ముంబై లో భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల ను నిర్వహిస్తున్నారు.పూజా హెగ్డే కూడా ఈ సందర్భం గా హాజరైంది.
సినిమా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయడంతో పాటు సినిమా యొక్క ప్రెస్ మీట్ నిర్వహించారు.

గతంలో కూడా రాధేశ్యామ్ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలను ముంబైలో మొదలు పెట్టిన ప్రభాస్ ఈ సారి కూడా అక్కడ షురూ చేయడం చర్చనీయాంశమైంది.ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ కనుక ముంబై పైనే అంటే ఉత్తరాది పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు ప్రభాస్ చేస్తున్న సినిమాలు.
చేయబోతున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల కాబోతున్నాయి.కనుక ప్రభాస్ ముంబైలో మకాం వేశాడు, అక్కడి నుండి కార్యక్రమాలు జరుపుతున్నాడు.