టాలీవుడ్ ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మనందరికీ సుపరిచితమే.విశ్వనటుడు కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే శృతిహాసన్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.అదే విషయాన్ని శృతి హాసన్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా సోకిందని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపింది.అయితే ప్రస్తుతం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న శృతిహాసన్ కు ఖాళీగా కూర్చోవడం చాలా బోరింగ్ గా ఉందట.
అంతేకాకుండా నీరసంగా కూడా ఉందని, ఏమీ తోచని పరిస్థితిలో ఉన్నాను అని అంటోంది.కరోనా వల్ల రెండు రోజులకే చాలా నీరసించి పోయానని, ఏం చేయాలో తెలియడం లేదు అని తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది.

శృతి హాసన్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆమె షేర్ చేసిన పోస్ట్ ని చూసిన అభిమానులు, పలువురు సినీ సెలబ్రిటీలు శృతిహాసన్ తొందరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.ఇక ఆ కామెంట్ కి శృతిహాసన్ రిప్లై ఇస్తూ మీ అందరి ఆశీస్సులతో త్వరలోనే కోలుకొని మీ ముందుకు వస్తాను అని సమాధానమిచ్చింది.