స‌త్య నాదెళ్ల కుమారుని మృతికి కార‌ణ‌మైన సెరిబ్రల్ పాల్సీ ఎంత ప్ర‌మాద‌క‌ర‌మంటే..

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు 26 ఏళ్ల జైన్ నాదెళ్ల మరణించారు .జైన్ పుట్టినప్పటి నుంచి సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడ్డారు.

 What Is Cerebral Palsy Satya Nadella Son Zain Nadella Details, Cerebral Palsy, S-TeluguStop.com

సెరిబ్రల్ పాల్సీ కేసులు భారతదేశంలో కూడా పెరుగుతున్నాయి.దేశంలోని ప్రతి 1000 మంది పిల్లలలో ముగ్గురు ఈ వ్యాధితో బాధపడుతున్నారని ప‌లు నివేదిక‌లు చెబుతున్నాయి.

ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించిన వివ‌రాల‌ను తెలుసుకుందాం.హెల్త్‌లైన్ తెలిపిన వివ‌రాల ప్రకారం మెదడు పూర్తిగా అభివృద్ధి చెందనప్పుడు, శరీరంలో అనేక రుగ్మతలు త‌లెత్తుతాయి.

దీనినే సెరిబ్రల్ పాల్సీ అంటారు.ఇది నాడీ సంబంధిత వ్యాధి.

ఈ వ్యాధి పిల్లల పుట్టుకకు ముందు అంటే త‌ల్లి గర్భంలో అభివృద్ధి చెందుతుంది.

నిపుణులు తెలిపిన వివ‌రాల ప్రకారం 85 శాతం సెరిబ్రల్ పాల్సీ కేసులు ఇది పుట్టుకతోనే వ‌స్తాయి.

దీనికి చాలా కారణాలు ఉండవచ్చు.ఉదాహరణకు గర్భధారణ సమయంలో శిశువు మెదడులో ఆక్సిజన్ లేకపోవడం, జన్యువుల‌ మ్యుటేషన్, మెదడులో ఇన్ఫెక్షన్ లేదా మెదడు నుండి రక్తస్రావం కావ‌డం ఇవన్నీ కార‌ణాలుగా నిలుస్తాయి.

సెరిబ్రల్ పాల్సీ యొక్క లక్షణాలు పిల్ల‌ల‌లో రెండేళ్ల వ‌య‌సులో కనిపిస్తాయి.

కండరాలు బిగుసుకుపోవడం, నడవడంలో ఇబ్బందులు, ఆహారం మింగడంలో ఇబ్బందులు, కళ్ల కండరాల్లో అసమతుల్యత ఏర్ప‌డ‌టం, అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గడం ఈ వ్యాధి లక్షణాలు.అత్యంత సాధారణంగా నడకలో ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి.దీనిని ఇది అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ ద్వారా గుర్తిస్తారు.

పరిస్థితిని బట్టి వ్యాధి ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సివుంటుంది.ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.

What Is Cerebral Palsy Satya Nadella Son Zain Nadella Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube