త్వరలోనే బిగ్ బాస్ బ్యూటీ దివి పెళ్లి!.. సాక్ష్యం ఇదే

సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా వారి నైపుణ్యాన్ని బయటపెట్టారు.సినిమా అవకాశాలను దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే మోడలింగ్ రంగంలో ఎంతో గుర్తింపు సంపాదించుకొని మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దివి మహర్షి సినిమాలో నటి పూజా హెగ్డే స్నేహితురాలిగా నటించి మంచి గుర్తింపు పొందారు.

అదే పాపులారిటీతోనే ఈమె ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న దివి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరెన్నో ఆఫర్లను దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత అనే విధంగా ఈమె జీవితం కొనసాగిపోతుంది.ఇదిలా ఉండగా సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.

Advertisement

ఈ క్రమంలోనే ఈమె తాజాగా మరొక ఫోటోని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ప్రస్తుత కాలంలో గూగుల్ ద్వారా చాలామంది మనకి జీవితంలో పెళ్లి ఎప్పుడు అవుతుంది మనకు డెత్ ఏ ఇయర్ లో అవుతుంది అంటూ చాలామంది తెలుసుకుంటూ వారి సంబంధించిన పెళ్లి, లేదా వారి బ్లడ్ గ్రూప్స్ అలాగే డెత్ ఇయర్ కూడా తెలుసుకుంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ బామ దివి కూడా తన పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అంటూ గూగుల్ ట్రై చేశారు.ఈ క్రమంలోనే త్వరలోనే తన పెళ్లి త్వరలోనే జరుగుతుందని చెప్పడంతో ఈమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఈ క్రమంలోనే వీటికి సంబంధించిన ఫోటోలను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఈమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉండడమే కాకుండా, సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకొని కెరియర్ లో దూసుకుపోతున్న వారిలో దివి ఒకరని చెప్పవచ్చు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు