ఆ పని చేసేందుకు ఒప్పుకున్నానంటే నమ్మకంగా లేదు: సమంత

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ గా కొనసాగుతు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉండి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈమె తన భర్త నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత ఏకంగా హాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సమంత తమిళంలో హీరో విజయ్ సేతుపతి నయనతార సమంత ముగ్గురు ప్రధానపాత్రలో నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కాత్తూ వాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశానికి సంబంధించిన ఒక ఫోటోను సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.ఈ క్రమంలోని ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఇందులో సమంత నయనతార ఇద్దరూ కూడా నలుపు తెలుపు రంగు దుస్తులను ధరించి విజయ్ సేతుపతితో కలసి టైటానిక్ సినిమాలో స్టిల్ కి ఫోజ్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే సమంత ఈ సన్నివేశం చిత్రీకరించే సమయానికి లొకేషన్ చేరుకున్నారు.ఈ సందర్భంగా ఈ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ అసలు ఈ సన్నివేశం చేయడానికి నేను ఒప్పుకున్నాను అంటే నమ్మకంగా లేదు అంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇకపోతే సమంత సినిమాల విషయానికి వస్తే ఈమె నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇప్పటికే డబ్బింగ్ పనులను కూడా సమంత పూర్తి చేశారు.ఇక యశోద సినిమా షూటింగ్ తో ప్రస్తుతం సమంత బిజీగా ఉన్నారు.

Advertisement

ఇక ఈ ఏడాది సమంత నటించిన శాకుంతలం యశోద రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ఇక నయనతార కూడా వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు.

ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.

తాజా వార్తలు