సెలబ్రెటీలు పనిచేసిన క్షణాలలో వైరల్ గా మారుతుంటుంది.అయితే వీరు చేసే పనులు ప్రజలపై తీవ్రస్థాయిలో ప్రభావాన్ని చూపిస్తాయనే సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే నటీనటులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని సమాజానికి ఉపయోగపడే విషయాలను చెబుతుంటారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ ముద్దుగుమ్మ రీచా చద్దా కూడా ఇలాంటి పని చేశారు.
ఈమె రోడ్డుపై నిలబడి వచ్చి పోయే వారికి హగ్స్ ఇస్తూ ఉన్నారు.అయితే ఈమె ఇలా అందరికీ హగ్స్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఎంతో బాధలో ఉన్న వారిని ఒకసారి ఆలింగనం చేసుకోవడం వల్ల వారి మనసులో ఉన్న బాధను మొత్తం తొలగించేస్తూ అందరినీ సంతోషంగా ఉండేలా చేస్తుంటారు ఈ క్రమంలోనే అలాంటి కాన్సెప్ట్ తోనే నటి రిచా చద్దా కూడా రోడ్డుపై నిలబడి అందరికీ ఇలా హగ్స్ ఇచ్చారు.ప్రజలు తమ బాధలు మరిచిపోయేందుకు రిచా ‘ఫ్రీ హగ్’ క్యాంపెయిన్‌ని నిర్వహించింది.
ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఎంతో మంది యువతీ యువకులు ఆమెను కౌగిలించుకొని వెళ్తున్నారు.అయితే ఈమె చేస్తున్న ఈ పని పై కొందరు ప్రశంసలు కురిపించగా మరికొందరు ఎప్పటిలాగే విమర్శలు చేస్తూ వచ్చారు.ఇలా ఈమె హగ్ ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరిలో పాజిటివ్ థాట్స్ వస్తుంటాయని కామెంట్లు చేయగా మరికొందరు ఈ కరోనా వంటి విపత్కర సమయంలోఏ విధమైనటువంటి మాస్కులు లేకుండా ఇలా ఒకరినొకరు హగ్ చేసుకోవడం ఏమాత్రం సరైంది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.