కేసీఆర్ పై రేవంత్ సంచలన ట్వీట్

తెలంగాణ రాజకీయాలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.

అయితే కేసీఆర్ గత రెండు రోజులుగా అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటన సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభల్లో ఖండించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా కెసీఆర్ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కూడా మరోసారి అస్సాం ముఖ్యమంత్రిపై ఫైర్ అయిన విషయం తెలిసిందే.అయితే రాహుల్ గాంధీ అడిగిన దానిలో తప్పేమి ఉందని ఒక ప్రతిపక్ష నాయకుడిగా అడిగితే చాలా సానుకూలంగా స్పందించాల్సింది పోయి అసభ్యకరంగా మాట్లాడుతారా అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే మీరు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నారా అంటే కాంగ్రెస్ పార్టీకి నేను మద్ద తివ్వాల్సిన అవసరం లేదని ఒక పౌరుడుగా నా అభ్యంతరాన్ని తెలియజేస్తున్నానని అన్నారు.అయితే కాంగ్రెస్ నాయకుల కంటే చాలా గట్టి స్వరంతో కేసీఆర్ మాట్లాడటం చూసి ఒక్కసారిగా రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది.

అయితే కాంగ్రెస్ నేతలు కెసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తారు అని భావించినా కేసీఆర్ కు వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు.

Advertisement

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ ఊసరె వెళ్ళి బొమ్మతో ట్వీట్ చేయగా దానిని రీట్వీట్ చేస్తూ కేసీఆర్ రోల్ మోడల్ ఇదేనని రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.అయితే రేవంత్ చేసిన ట్వీట్ పై టీఆర్ఎస్ నేతలు అంతగా రియాక్ట్  కాకున్నా సడెన్ గా కేసీఆర్ రాహుల్ గాంధీని పొగడటంపైనే సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా కేసీఆర్ వ్యూహాలను అంచనా వేయడం అంత సులభం కాక పోయినా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పట్ల టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు