పశ్చిమ బెంగాల్.భారత దేశానికి తూర్పు భాగంలో ఉన్న ఒక రాష్ట్రం.
భారతదేశంలో బ్రిటిష్ వారు 1905లో విభజించు-పాలించు అనే విధానాన్ని అనుసరించి బెంగాల్‌ను విభజించారు.కానీ ప్రజల ఆగ్రహం కారణంగా 1911లో బెంగాల్ మరోసారి ఏకమైంది.
అయితే దీనిని పశ్చిమ బెంగాల్ అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.భారతదేశం 1947లో స్వాతంత్య్రం పొందింది.
ఆ సమయంలో ముస్లిం ఆధిపత్యం ఉన్న ప్రాంతం తూర్పు బెంగాల్‌గా (తరువాత బంగ్లాదేశ్‌గా మారింది), భారత్‌లో ఇప్పుడు ఉన్న భాగం పశ్చిమ బెంగాల్‌గా విభజించబడింది.నిజానికి ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ ఒక రాష్ట్రం.
1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తూర్పు పాకిస్తాన్ (నేటి పాకిస్తాన్) మరియు పశ్చిమ పాకిస్తాన్ ఆవిర్భవించాయి.1971 యుద్ధం తరువాత తూర్పు పాకిస్తాన్ స్వతంత్రంగా మారింది.బంగ్లాదేశ్‌గా మారింది.దాని పశ్చిమ భాగాన్ని నేడు పశ్చిమ బెంగాల్ అని పిలుస్తున్నారు.వంగా లేదా బంగా అనే పదం నుండి బెంగాల్ అనే పేరు వచ్చింది.ఈ రాష్ట్రం 4000 నాటి నాగరికత విశేషాలను పశ్చిమ బెంగాల్ కలిగి ఉంది.భారతదేశంలో బెంగాల్ చరిత్రకు తనదైన ప్రత్యేకమైన స్థానం ఉంది.16వ శతాబ్దంలో మొఘల్ కాలానికి ముందు బెంగాల్ అనేక మంది ముస్లిం పాలకులు మరియు సుల్తానులచే పాలించబడింది.మొఘలుల తర్వాత యూరోపియన్ మరియు ఆంగ్ల వ్యాపార సంస్థల రాకతో బెంగాల్‌లో ఆధునిక కాలం ప్రారంభమైంది.1757లో ప్లాసీ యుద్ధం చరిత్రను మార్చింది.మొదట్లో బ్రిటిష్ వారు భారత దేశంలో ముఖ్యంగా బెంగాల్‌లో తమ స్థావరాన్ని ఏర్పరచు కున్నారు.రాజకీయ ప్రయోజనాల కోసం బెంగాల్‌ను బ్రిటిష్ వారు రెండు ప్రాంతాలుగా విభజించారు.
అయితే పెరుగుతున్న ప్రజల ఆగ్రహం కారణంగా 1911 సంవత్సరంలో కాంగ్రెస్ నాయకత్వంలో బెంగాల్ మరోసారి ఐక్యమైంది.