తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ వార్తల్లో నిలవడం కన్నా స్వంత పార్టీ నేతల మీద వ్యాఖ్యలు చేస్తూనే వార్తల్లో నిలుస్తోంది.అయితే తాజాగా రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ హనుమంతరావు తనను కాంగ్రెస్ నుండి బయటికి పంపేలా పావులు కదుపుతున్నారని, నా రక్తం కాంగ్రెస్ రక్తం అని రేవంత్ రెడ్డి సీనియర్ లతో వ్యవహరిస్తున్న తీరు పట్ల సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తానని అంతేకాక కాంగ్రెస్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది.
అయితే ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో పార్టీలో నేతలందరు కలిసి పనిచేస్తేనే గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
కాని ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో నేతల్లో సమన్వయం లేకపోవడంతో పార్టీవైపు ప్రజల దృష్టి మరలే అవకాశం లేదు.
అయితే ప్రస్తుతం వీహెచ్, జగ్గారెడ్డి లాంటి నేతలు ఇప్పటికీ రేవంత్ కు వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శల వర్షం కొనసాగిస్తున్న తరుణంలో రేవంత్ మాత్రం వీహెచ్ వ్యాఖ్యలపై స్పందించిన పరిస్థితి లేదు.అయితే ఈ వ్యవహారం హైకమాండ్ జోక్యంతో సద్దుమణుగుతుందా లేక సీనియర్ లకు, రేవంత్ కు మధ్య ఇలాగే వచ్చే ఎన్నికల వరకు వైరం కొనసాగుతుందా అనేది అనేది కాంగ్రెస్ లో పెద్ద చర్చగా మారింది.

అయితే రేవంత్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో ముందుకు వెళ్తూ తన వ్యూహాలను మాత్రమే అమలుచేస్తూ తనతో కలిసి వచ్చే వారిని కలుపుకపోతూ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలనే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.అయితే కెసీఆర్ మాత్రం ఎక్కడా కాంగ్రెస్ పార్టీపై వ్యాఖ్యానించకపోవడంతో కాంగ్రెస్ అనేది పెద్దగా ప్రజల్లో చర్చకు రావడం లేదు.







