వివాదాలకు దూరంగా ఉండే టాలీవుడ్ హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు.గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉండే సాయిపల్లవి తనకు నచ్చిన కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలలో మాత్రమే నటిస్తారు.
కొన్నేళ్ల క్రితం నాగశౌర్య, సాయిపల్లవి కాంబినేషన్ లో కణం అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు.
అయితే ఈ సినిమా సమయంలో నాగశౌర్య సాయిపల్లవి గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అయ్యాయి.సాయిపల్లవి అన్ ప్రొఫెషనల్ హీరోయిన్ అని నాగశౌర్య చెప్పడంతో పాటు సెట్ లో చాలామంది సాయిపల్లవి బిహేవియర్ వల్ల ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.
సాయిపల్లవి సహనం కోల్పోతారని అనవసర విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటారని నాగశౌర్య అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

మూడు సంవత్సరాల క్రితం నాగశౌర్య ఈ కామెంట్లు చేయగా సాయిపల్లవి ఈ కామెంట్ల గురించి తాజాగా స్పందిస్తూ కణం సినిమాకు పని చేసిన కెమెరామేన్ తో పాటు ఆ సినిమా దర్శకునికి ఫోన్ చేశారు.వాళ్లకు కణం మూవీ షూటింగ్ సమయంలో నా వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా? అని సాయిపల్లవి అడగగా అవతలి వ్యక్తుల నుంచి లేదనే సమాధానం వినిపించింది.నాగశౌర్య అంటే నటుడిగా తనకు అభిమానమని సాయిపల్లవి పేర్కొన్నారు.

నాగశౌర్య తన గురించి చేసిన కామెంట్లను తాను పాజిటివ్ గానే తీసుకున్నానని ఆమె తెలిపారు.నాగశౌర్య తనలో నచ్చని గుణాన్ని మాత్రమే బయటపెట్టారని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.నాగశౌర్యకు తన వల్ల ఇబ్బంది కలిగిందని తెలిసి తనకు బాధగా అనిపిస్తోందని నా జవాబుతో నాగశౌర్య సంతృప్తి చెందుతారని భావిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.