తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.నాట్స్ ఆధ్వర్యంలో మహిళ లకు అవగాహన సదస్సు

అమెరికా తెలుగు సంఘం ( నాట్స్ ) ఆధ్వర్యంలో మహిళల్లో ఆర్థిక స్వాలంబన సాధించడానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టేందుకు నాట్స్ చైర్మన్ అరుణ గంటి ఆధ్వర్యంలో మహిళలతో వెబినార నిర్వహించారు.

2.సౌదీ లో సల్మాన్ కు అరుదైన గౌరవం

సౌదీ అరేబియాలో సల్మాన్ ఖాన్ కు అరుదైన గౌరవం దక్కింది. పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను ప్రధానం  చేశారు.

3.యూఏఈ లో కొత్త రూల్

యూఏఈ  పౌరులతో పాటు, నివాసితుల వ్యక్తిగత సమాచారం సేకరణ పై ఆదేశ ప్రాసిక్యూషన్ కీలక ప్రకటన చేసింది.ఇక పై ఎమిరేటిల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆ దేశ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.

4.అమెరికాలో మంచు తుఫాను .వారికి సెలవులు

అమెరికా లో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది.  మంచు ప్రభావం తీవ్రంగా ఉన్న చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు,  స్కూళ్ల కు సెలవులు ప్రకటిస్తున్నారు.

5.క్వారంటైన్ సమయం కుదింపు

బంగ్లాదేశ్ లో కరోనా నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చారు.14 రోజుల క్వారంటైన్ ను పది రోజులకి కుదించారు.

6.మిస్ యూఎస్ 2019 విజేత మృతి

మిస్ యూఎస్ 2019 విజేత చెస్లి క్రిస్టీ (30 ) భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

7.రహస్య ప్రదేశంలోకి కెనడా ప్రధాని

Advertisement

కెనడాలో వాక్సిన్ తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన కారులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది.

8.బ్రెజిల్ లో భారీ వర్షాలు .20 మంది మృతి

బ్రెజిల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.వరదల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి.దాదాపు 20 మంది వరకు మృతి చెందినట్టు సమాచారం.

9.మార్చి 1 నుంచి హెచ్ 1 బీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

భారత టెకి లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హెచ్ వన్ బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది.

10.వియన్నా చర్చలకు వారం విరామం

ఇరాన్ పై ఆంక్షలు ఎత్తివేయడానికి, ఇరాన్ అణు ఒప్పందాన్ని పరిపుష్టం చేసేందుకు ఉద్దేశించిన వియన్నా చర్చలకు వారం పాటు విరామం ఇవ్వాలని, నిర్ణయించుకున్నారు.

ఈ చర్చల్లో ఇరాన్ తో పాటు, జీ 4 ప్లస్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్,  రష్యా, చైనా, జర్మనీలు పాల్గొంటున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు