సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ఎంతోమంది తమ కెరియర్లో ముందుకు వెళ్లడం కోసం ఈ విధమైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.
ఇలా ఎంతోమంది కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నామని బహిరంగంగా వెల్లడించారు.ఈ క్రమంలోనే హిందీ సిరీయల్ ‘యె హై మొహబ్బతే’ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన సౌందర్య రాశి దివ్యాంక త్రిపాఠీ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యాంక కెరియర్ మొదట్లో తనకు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు.
ఇండస్ట్రీ లోకి రావాలని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని అవకాశాలను అందుకుంటామని అవకాశాలు వచ్చిన తర్వాత ఒకానొక సమయంలో మన దగ్గర డబ్బులు లేకపోవడంతో బిల్లులు, ఈఎమ్ఐలు కట్టలేని పరిస్థితికి వస్తాం.
ఇలా ఒత్తిడికి గురైనప్పుడు మనకు కొందరు దర్శకుల నుంచి ఆఫర్లు వస్తాయని అయితే ఆఫర్లు రావాలంటే వారితో కొంత సమయంపాటు గడపాలని మనకు ఆఫర్ ఇస్తారని తెలిపారు.ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చేస్తున్నారు మీరు కూడా వారితో కొంత సమయం గడపాలని చెబుతారని చాలామంది అవకాశాల కోసం ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని ఆమె తెలిపారు.
ఈ విధంగా కెరియర్ మొదట్లో తనకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని అయితే ఎంతో కష్టపడి మొదటి అవకాశాన్ని సంపాదించుకున్న మనకి రెండవ అవకాశం కూడా వస్తుందని ఎవరూ కూడా ఇలాంటి ప్రలోభాలకు గురి కావాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా దివ్యాంక త్రిపాఠి తన కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి తెలియజేశారు.