రేవంత్ చెప్పినా అంతే.. పార్టీ సభ్యత్వ నమోదులో పట్టింపే లేదు..!

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్ గిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతనమైన జోష్ వచ్చింది.

దాంతో ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ నేతలు భావించారు.ఆ దిశగా రేవంత్ ప్రయత్నాలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కూడా.

కానీ, రేవంత్ అనుకున్న లక్ష్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోని వ్యక్తులే పని చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.టీపీసీసీ చీఫ్ రేవంత్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు టార్గెట్ ను ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

కనీసం 30 లక్షల మందిని కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా నమోదు చేసి సరికొత్త రికార్డు చేయాలని రేవంత్ ప్లాన్ వేసుకున్నారు.ఈ మేరకు నియోజకవర్గ స్థాయి నేతలందరికీ టార్గెట్ కూడా ఇచ్చారు.

Advertisement

కానీ, వారు రేవంత్ నిర్దేశించిన లక్ష్యాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ సీనియర్ నేతలు అంతగా దృష్టి సారించడం లేదని సమాచారం.

అయితే, తన నియోజకవర్గం అయిన కొడంగల్ లో మాత్రం 70 వేల సభ్యత్వాలు చేయించి ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలు సత్తా చాటారు.

ఇకపోతే రేవంత్ రెడ్డి వర్గీయులుగా పేరు పడిన నియోజకవర్గాల్లో అయితే నేతలు కొందరు సభ్యత్వ నమోదు కోసం కష్టపడుతున్నారు.అయితే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని వార్తలొస్తున్నాయి.ఉదాహరణకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం.

ఆ నియోజకవర్గంలో రెండు వేల సభ్యత్వాలు మాత్రమో నమోదయ్యాయని తెలుస్తోంది.ఇటువంటి నియోజకవర్గాలు దాదాపు 40 ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.అయితే, నేతలు ఇలా చేయడానికి గల కారణం రేవంతే అని టాక్.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు అనుకున్న స్థాయిలో అయితే ఆటోమేటిక్ గా రేవంత్ కే పేరు వస్తుందని, హై కమాండ్ రేవంత్ ను గౌరవిస్తుందని, అందుకే నేతలు దీనిపై పెద్దగా ఫోకస్ చేయడం లేదని టాక్.

Advertisement

తాజా వార్తలు