త్వరలో ప్రకటించే టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనుందా?

తెలంగాణ రాష్ట్రంలో అనధికారికంగా ఎన్నికల వాతావరణం అనేది నెలకొన్నది అనేది ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి మనకు అర్ధమవుతోంది.

అయితే అన్ని పార్టీలలా టీఆర్ఎస్ పార్టీ వెళ్లకుండా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోన్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పదవులు మెజారిటీగా ఎమ్మెల్యే లకే కేటాయించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కేసీఆర్ వ్యూహంపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే.అయితే ఇక జిల్లా అధ్యక్షుల నియామకం తరువాత ఇక త్వరలో రాష్ట్ర స్థాయి కమిటీలను కెసీఆర్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా రాష్ట్ర స్థాయి కమిటీలలో ఎవరెవరు ఉంటారనే విషయం వారి పేర్లు బయటికి రాకున్నా పార్టీలో అంతర్గతంగా కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.అయితే ఇప్పుడు రాష్ట్ర స్థాయి కమిటీయే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకంటే వచ్చే ఎన్నికల వరకు ఇటు ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఇటు అభివృద్ధి పనులు కావచ్చు చాలా వరకు ప్రజలకు అందడం, టీఆర్ఎస్ పార్టీకి, కెసీఆర్ కు ఒక్క సారిగా క్రేజ్ అనేది పెరగడం అనేది చాలా వేగంగా జరుగుతుంది.ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఇటు జిల్లా అధ్యక్షులను, జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులను ఒక్క తాటిపై నడిపించేలా కెసీఆర్ ఈ కమిటీలను చాలా చాకచక్యంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కొంత టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారినా రానున్న రోజుల్లో మాత్రం టీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఉంటుందని కెసీఆర్ బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఎందుకంటే ప్రస్తుతం ప్రజలు ఏయే విషయాలపై ఆగ్రహంగా ఉన్నారనే విషయంపై ఇప్పటికే ఒక సర్వే ద్వారా ఒక అవగాహనకు వచ్చిన కెసీఆర్ ఇక రానున్న రోజుల్లో కెసీఆర్ తీసుకునే నిర్ణయాలే టీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని మనం బలంగా చెప్పవచ్చు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు