మొగిలయ్యకు కోటి రూపాయిలు ప్రకటించిన కేసీఆర్..!

నాగర్ కర్నూల్ కు చెందిన దర్శనం మొగిలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తరతరాలుగా వస్తున్నటువంటి కిన్నెర మెట్ల వాయిద్యంతో జీవనం కొనసాగిస్తున్న మొగిలయ్య ఒకే ఒక్క పాట ద్వారా రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయారు.

12 మెట్ల కిన్నెరతో తన కలను బతికించాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన మొగిలయ్యకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా పద్మశ్రీ అవార్డును పురస్కరించింది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు ఎన్నో కష్టాలను అనుభవించిన మొగిలయ్య ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ని కలిసి తన కలను బతికించాలని వేడుకున్నారు.

ఈ క్రమంలోనే మొగులయ్య కిన్నెర మెట్ల కథను 8వ తరగతి పాఠ్య పుస్తకంలో చేర్చారు.ఇలా మొగులయ్య కిన్నెర మెట్ల ద్వారా "ఆడా లేడూ మియా సాబ్.

ఈడా లేడూ మియా సాబ్"అంటూ మొగిలయ్యే ఈ పాటను పాడేవారు.ఇదే పాటను చరణం మార్చి ఆ పాట స్వచ్ఛత కోల్పోకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో ఆడా గాదు ఈడా గాదు.

Advertisement

అమీరోళ్ల మేడా గాదు.పుట్టిండాడు పులిపిల్ల అంటూ మొగిలయ్య పాడిన ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేసిన అని చెప్పాలి.

ఈ పాట ద్వారా ఎంతో ఫేమస్ అయిన మొగిలయ్యను కేంద్ర ప్రభుత్వం గుర్తించి అతనికి పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.ఇలా పద్మశ్రీ అవార్డుతో ఘనంగా సత్కరించడం కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కోటి రూపాయల నగదును ప్రకటించారు.ఇప్పటి వరకు మొగిలయ్య సొంత గ్రామంలో ఉండటానికి సరైన ఇల్లు కూడా లేకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో ఇంటి నిర్మించుకోవడం కోసం స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే కోటి రూపాయలను అందజేయడంతో మొగిలయ్య జీవితమే మారిపోయిందని చెప్పాలి.

ఇలా ముఖ్యమంత్రి తనకు సహాయం చేయడంతో మొగిలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు